ప్లాన్ అంటే ఇది, అక్రమ సంబంధం, ముఖం, ప్రైవేట్ పార్ట్స్ ఏ మాత్రం గుర్తు పట్టకుండా ?
చెన్నై/ధర్మపురి: ఓ వ్యక్తికి ఫోన్ చేసి మేము చెప్పిన చోటకు రావాలని సూచించారు. ఎదుటి వాళ్లు చెప్పిన టైమ్ కంటే ముందుగానే అక్కడికి వెళ్లిన వ్యక్తి ఫోన్ చేసిన వ్యక్తి కోసం ఎదురు చూశాడు. తరువాత కొందరు కలిసి అక్కడే ఉన్నారు. మరుసటి రోజు స్థానికులు వెళ్లి చూడగా ఓ వ్యక్తి తల మీద బండరాళ్లు వేసి ముఖం గుర్తు పట్టకుండా నుజ్జునుజ్జు చేశారు. అతని మర్మాంగం కూడా పచ్చడి చెయ్యడం కలకలం రేపింది.
తమిళనాడులోని ధర్యపురి జిల్లాలోని బెన్నగారం సమీపంలోని అరియూరు దగ్గర సుమారు 42 ఏళ్ల వ్యక్తి శవమైనాడు. మేకలు, పశువులు మేపుకునే వాళ్లు అటవి ప్రాంతంలోకి వెళ్లి చూడగా ఓ వ్యక్తి శవమై కనిపించడంతో హడలిపోయి గ్రామంలోకి పరుగు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అరియూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనాడని వెలుగు చూసింది. ఆ వ్యక్తి తల మీద బండరాళ్లు వేసి ముఖం ఏమాత్రం గుర్తు చిక్కకుండా నుజ్జునుజ్జు చేశారు. ముఖంతో పాటు అతని మర్మాంగం మీద బండరాళ్లతో దాడి చేసి పచ్చడి చేశారని అరియలూరు పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ యువరాజ్ స్థానిక మీడియాకు చెప్పారు.
అక్రమ సంబంధం కారణంగా ఇతనికి ఫోన్ చేసి నిర్జన ప్రదేశంలోకి పిలిపించుకుని తరువాత హత్య చేసి ఉంటారని పోలీసులు అన్నారు. పోలీసులు మరో అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మహిళ కుటుంబ సభ్యులు ఇతన్ని ఇంత కిరాతకంగా హత్య చేసి ఉంటారని, హంతకుల కోసం గాలిస్తున్నామని ఇన్స్ పెక్టర్ యువరాజ్ అన్నారు. ఈ హత్యతో ఆ ప్రాంతం ప్రజలు హడలిపోయారు.












Click it and Unblock the Notifications