అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ ఎన్నిక చెల్లదు: ఎన్నికల కమిషన్ కు!
చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళ నాటరాజన్ ను తొలగించాలని కోరుతూ తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలోని 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషనన్ కు విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు.
ఐదేళ్ల పాటు నిరంతరాయంగా సభ్యులుగా ఉన్న వారే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులని పార్టీ విధివిధానాల్లో ఉందని ఎంపీలు ఎన్నికల కమిషన్ కు చెప్పారు. అయితే శశికళ పార్టీలో సభ్యత్వం తీసుకుని ఐదేళ్లు పూర్తి కాకముందే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారని గుర్తు చేశారు.

నిబంధన 20(2) ప్రకారం పార్టీ ప్రధాన కార్యదర్శిని తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, అండమాన్-నికోబార్ దీవుల్లోని పార్టీ సభ్యులు మాత్రమే ఎన్నుకోవాలని గుర్తు చేశారు. పార్టీలో మార్పులు, చేర్పులు, కొత్తవాటిని రూపొందించడం అన్నాడీఎంకే సర్వసభ్యులకు మాత్రమే ఉందని అన్నారు.
ఈ విషయం నిబంధన 43లో పేర్కొని ఉందని వారు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నియమాలను పాటించకుండా నిబంధనలకు విరుద్దంగా జరిగిన శశికళ ఎన్నిక చెల్లదని వారు పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు వాదిస్తున్నారు. ఈకారణంగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని మనవి చేస్తూ ఆపార్టీకి చెందిన 12 మంది ఎంపీలు ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications