పన్నీర్ సెల్వం ఫ్మామిలీ విదేశీ పర్యటనలు: విచారణ కమిటీ: టీటీవీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: పన్నీర్ సెల్వం అధికారంలో ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనల చేశారని, ఆ సమయంలో అధికార దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించనున్నామని ఆయన ప్రత్యర్థులు అంటున్నారు.

పన్నీర్ సెల్వం, ఆయన కుటుంబ సభ్యులు విదేశీ పర్యటనలు చేపట్టడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ ప్రశ్నించారు. ఆదివారం దినకరన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు.

శశికళకు ఒక నెల పూర్తి అయ్యింది: దిక్కే లేకుండా జైల్లో పాపం ఇలా !

అన్నాడీఎకేం పార్టీ కోశాధికారిగా పని చేసిన సమయంలో పన్నీర్ సెల్వం పార్టీ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అన్నాడీఎంకే పార్టీ నిధులతో, అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి ఆయన కుటుంబ సభ్యులు విదేశీ పర్యటనలు చేశారని తాము గుర్తించామని ఆరోపించారు.

There is a need to form Inquiry commission on OPS and his family members on often tripping to foreign countries.

అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లంఘించి పార్టీ, ప్రభుత్వ నిధులు పన్నీర్ సెల్వం తన కుటుంబ సభ్యుల విలాసాల కోసం ఉపయోగించారని తాము గుర్తించామని, ప్రత్యేక కమిటీతో దర్యాప్తు చేయించి విచారణ చేయించి పన్నీర్ సెల్వం మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.

చిన్నమ్మ'శశికళ ఫ్యామిలీ'లో చిచ్చు: రగిలిపోతున్నారు, మొదటికే మోసం !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ అక్క కుమారుడు, అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ. దినకరన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీటీవీ. దినకరన్ కు పోటీగా పన్నీర్ సెల్వం వర్గం నుంచి జయలలిత సన్నిహితుడు, సీనియర్ నేత మధుసూదనన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు జరుగుతున్న సందర్బంలో పన్నీర్ సెల్వం పార్టీ నిధులు, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని దినకరన్ మా నాయకుడి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
There is a need to form Inquiry commission on O.Panneer selvam and his family members on often tripping to foreign countries, says T.T.V. Dinakaran.
Please Wait while comments are loading...