ఆత్మహత్య కేసులో మంత్రి ఏ1 నిందితుడు: రాజీనామా చెయ్యరు: సీఎం, సిగ్గు మానం ఉందా, బీజేపీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: పోలీసు అధికారి (డీఎస్పీ) ఎంకే. గణపతి ఆత్మహత్య కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ ఆర్ లో ఏ1 నిందితుడిగా ఉన్న మాజీ హోం మంత్రి, ప్రస్తుత బెంగళూరు అభివృద్ది శాఖా మంత్రి కేజే. జార్జ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తేల్చి చెప్పారు.

మంత్రి కేజే. జార్జ్ ప్రభావం సీబీఐ మీద ఏమీపడదని, అందువలన ఆయన రాజీనామా చెయ్యాల్సిన అవసరం లేదని సీఎం సిద్దరాయ్య చెప్పారు. మంత్రి కేజే. జార్జ్ మీద సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యడంతో శుక్రవారం ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య మంత్రులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమై చర్చించారు.

There is no need to resign KJ George can not influence the CBI Siddaramaiah

సమావేశం అనంతరం సీఎం సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ మంత్రి జార్జ్ ను వెనుక వేసుకుని వచ్చారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని సీఎం సిద్దరామయ్య గుర్తు చేశారు. మంత్రి హోదాలో ఉన్న జార్జ్ సీబీఐ మీద ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం లేదని అన్నారు.

కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ సిద్దరామయ్య ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్. యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ సిద్దరామయ్యకు సిగ్గు, మానం, మర్యాద ఏమైన ఉంటే వెంటనే జార్జ్ ను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ వెంటనే జార్జ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి కేసు విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Home Minister and Bengaluru Development Minister KJ George can not influence the investigation agency CBI. So, there was no question of George’s resignation said Chief Minister Siddaramaiah in Bengaluru.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X