వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్, డెంగ్యూపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్: పండగల సీజన్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ పరిస్థితులతోపాటు డెంగ్యూ, ఇతర సీజనల్ వ్యాధులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని జరిపింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో సెరోటైప్-II విస్తరిస్తోందని తెలిపింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా సమక్షంలో హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ దేశంలోని కరోనా పరిస్థితులపై చర్చించారు. నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ తోపాటు ఇతర ఉన్నతాదికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

దేశంలో విజృంభిస్తున్న డెంగ్యూ జ్వరాలను అరికట్టేందుకు రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాధిని తొందరగా గుర్తించడం ద్వారా బాధితులను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. టెస్టింగ్ కిట్స్, వ్యాధికి సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఫీవర్ సర్వే, కాంటాక్ట్ ట్రేసింగ్, వెక్టర్ కంట్రోల్ లాంటి చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. బాధితులకు అవసరమైన రక్తం, ప్లేట్‌లెట్స్ అందుబాటులో ఉంచేలా బ్లడ్ బ్యాంకులు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డెంగ్యూ లక్షణాలను వివరించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది.

 there is no room for complacency: Cabinet Secretary Rajiv Gauba high level meeting on coronavirus and vaccination

దేశంలో కరోనావైరస్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను, నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గౌబా హెచ్చరించారు. ఇందుకు ఆయన పలుదేశాల పరిస్థితిని ఉదహరించారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలను చేపట్టాలని సూచించారు. వ్యాక్సినేషన్ వేగం పెంచాలని పేర్కొంది.

15 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో 34 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందని, మరో 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం నుంచి 10 శాతం వరకు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వచ్చే పండగల సీజన్లో ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించి కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుకోవాలని సూచించింది. లేదంటే మరోసారి కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది.
అవసరమైతే ఆంక్షలను అమలు చేయాలని సూచించింది.

కాగా, దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 35వేల ఎగువకు కొత్త కేసులు వెలుగుచూశాయి. అంతకముందు రోజుతో పోల్చితే తాజాగా 3.6 శాతం మేర పెరిగాయి. అయితే, కొత్త కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 14.48 లక్షల మందికి పరీక్షలు చేయగా.. కొత్తగా 35,662 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్లకు చేరింది. కరోనా బారిన పడి మరో 281 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మరణించిన సంఖ్య 4,44,529కు చేరింది. మరోవైపు, శుక్రవారం 33వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.26కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3.4 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.02 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.65 శాతానికి చేరింది. కాగా కేరళలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో శుక్రవారం 23 వేలకుగా కరోనా కేసులు నమోదు కాగా, 131 మరణాలు సంభవించాయి. మరోవైపు, మహారాష్ట్రలో 3586 మంది కరోనా బారినపడ్డారు. కాగా, శుక్రవారం ఒక్కరోజే ప్రధాని నరేంద్ర మోడీని పుట్టిన రోజును పురస్కరించుకుని 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది.

English summary
there is no room for complacency: Cabinet Secretary Rajiv Gauba high level meeting on coronavirus and vaccination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X