శివసేనతో కలవడం తప్పులేదు... సోనియాతో కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ ,ఎన్సీపీ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ హుస్సెన్ దాల్వాయి ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అలోచన చేయాలని లేఖలో పేర్కోన్నారు. ఈ సంకీర్ణంలో ఎలాంటీ తప్పు లేదని ఆయన లేఖలో పేర్కోన్నారు. శివసేన , బీజేపీ సిద్దాంతాలు వేరని , బీజేపీ కంటే శివసేన చాల మెరుగైన పార్టీ అంటూ ఆయన పేర్కోన్నారు. రాష్ట్రంలో బీజేపీ నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టాలని ఆయన సోనియాను కోరారు.
శివసేన కాంగ్రెస్ ,తోపాటు ఎన్సీపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో తప్పులేదని , గతంలో కూడ శివసేన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిందని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ కాలంలో మహరాష్ట్రలో ఏఆర్ అంతులే సీఎంగా ఉన్నప్పుడు శివసేన మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. దీంతో పాటు రాష్ట్రపతిగా ప్రతిభాపాటిల్ ఎన్నికయ్యో సంధర్భంలో శివసేన మద్దతు తెలిపిందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రె ప్రతిపాదనతో వస్తే కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రతిపాదనపై చర్చిస్తుందని ఆయన అన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాత్రం శివసేనతో పోత్తులపై ఎలాంటీ కామెంట్స్ చేయలేదు. క్రింది స్థాయిలో నేతలు, పార్టీ సీనియర్ నేతలు మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై స్పందిస్తున్నా... అధినాయకత్వం మాత్రం తన జరిగే పరిణామాలపై అంతర్గతంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు శివసేనకు మద్దతు ఇవ్వమని ప్రకటించిన ఎన్సీపీ సైతం శివసేనతో చేతులు కలిపింది. ఇరు పార్టీల నేతలు ఫోన్లో మంతనాలు సైతం జరిపారు. ఈ పరిణామాలతో మరో అయిదు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే ఎలాంటీ పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications