భారతదేశంలోనే అత్యంత దరిద్రంగా ఉండే, చెత్త రైళ్లు ఇవే!
భారతీయ రైల్వే దేశ ప్రగతిలో భాగస్వామ్యం తీసుకుంటున్న విషయం తెలిసిందే. భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రగతిలో వేగంగా అడుగులు వేస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇంత ప్రగతి పరుగులు పెడుతున్న రైల్వేలో ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న కొన్ని రైళ్లు కూడా ఉన్నాయి. ఇంత మురికి రైళ్లలో ప్రయాణం చేస్తున్నామనే భావన కలిగిస్తున్న ఆ రైళ్ల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
సహర్సా - అమృత్‌సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్:
బీహార్లోని సహర్సా జంక్షన్ నుండి పంజాబ్లోని అమృత్సర్ జంక్షన్ మధ్య నడిచే గరీబ్ రథ్ రైలు అత్యంత అపరిశుభ్రమైన రైలుగా పరిగణించబడుతుంది. ఈ రైలులో ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం, ఆ చెత్తలోనే కూర్చుంటూ ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. నాన్ స్టాప్ గా ప్రయాణించే ఈ రైలులో శుభ్రం చేయడానికి కనీసం సమయం ఉండదు. దీంతో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ రైల్లో టాయిలెట్లు అత్యంత భయంకరం.

అజ్మీర్ జమ్ము తావి పూజ ఎక్స్ప్రెస్:
రాజస్థాన్లోని అజ్మీర్ నుండి జమ్మూ కాశ్మీర్ లోని జమ్ముతావి వరకు నడిచే ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ మూడు నాలుగు రాష్ట్రాల మీదుగా వెయ్యి కిలోమీటర్ల పైగా ప్రయాణం చేస్తుంది. అపరిశుభ్రంగా దుర్గంధాన్ని వెదజల్లుతూ ఉంటుంది. దేశంలోనే అపరిశుభ్రమైన రైళ్లల్లో ఇది ఒకటి. ప్రయాణికుల నిర్లక్ష్యం, రైల్వే శాఖ పట్టింపులేని తనంతో ఈ రైలు అత్యంత దరిద్రమైన రైలు గా గుర్తించబడింది.
స్వరాజ్ ఎక్స్ప్రెస్:
దేశ ఆర్థిక రాజధాని ముంబై నుండి జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి రాకపోకలు సాగించే ఈ రైలు ఎంతోమంది యాత్రికులకు తన సేవలను అందిస్తుంది. అయితే ఈ రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులు అపరిశుభ్రమైన వాతావరణంలో చెత్తాచెదారం మధ్య ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ రైలు శుభ్రత గురించి రైల్వే శాఖకు తరచూ ఫిర్యాదులు అందుతున్న దీనిని బాగు చేస్తున్న దాఖలాలు లేవు.
త్రిపుర సుందరి ఎక్స్ప్రెస్:
పంజాబ్లోని ఫిరోజ్ పూర్ నుండి త్రిపురలోని అగర్తల మధ్య ఈ రైలు నడుస్తుంది. చాలా దూరం ప్రయాణించే ఈ రైలు అపరిశుభ్రంగా ఉండే రైళ్లలో ఒకటి. నిత్యం చెత్త చెదారంతో, దుర్గంధం వెదజల్లుతూ ఈ రైలు మురికి రైలు గా గుర్తింపు పొందింది. ఈ రైలు శుభ్రత గురించి ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన దాని పరిస్థితి మాత్రం మారడం లేదు.
.
సీమాంచల్ ఎక్స్‌ప్రెస్:
న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి బీహార్లోని జోగ్ బాని రైల్వే స్టేషన్ మధ్య రాకపోకలు సాగించే రైలు సీమాంచల్ ఎక్స్ప్రెస్. ఈ రైలులో ప్రయాణం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడు చెత్తాచెదారం తో, దుర్గంధంతో ఈ రైలులో ప్రయాణం చేయలేం బాబోయ్ అన్నట్టు అనిపిస్తుంది. ఇందులో ప్రయాణించాలంటే చాలా మంది ప్రయాణికులు భయపడి పారిపోతారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications