వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి రేసులో వీరే.. ఆరిఫ్ మహ్మద్ ఖాన్..? శరద్ పవార్ పేరు కూడా..

|
Google Oneindia TeluguNews

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులపై చర్చ నెలకొంది. ఇదివరకు దళితుడికి అవకాశం కల్పించారు. మరీ ఈ సారి ఎవరికీ పదవీ దక్కుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. వీరిలో ఐదారుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధికార బీజేపీ నుంచి ఆరుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విపక్ష కూటమి నుంచి ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి.

ఆరిఫ్ మహ్మద్ ఖాన్

ఆరిఫ్ మహ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేరును బీజేపీ పరిశీలిస్తోంది. దాదాపు ఖాయం అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇదివరకు దళితుడు కోవింద్‌కు ఛాన్స్ ఇవ్వగా.. ఈసారి మైనార్టీకి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆరిఫ్ కాకుంటే వెంకయ్య నాయుడుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉప రాష్ట్రపతి అయిన ఆయనకు ప్రమోషన్ లభిస్తోందని చర్చ జరుగుతుంది. వీరిద్దరూ కాకుంటే తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, అసోం గవర్నర్ జగదీశ్ ముఖి, ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రైపది ముర్మ్, ఛత్తీస్ గఢ్ గవర్నర్ అనసూయ యూకీ పేర్లు వినిపిస్తున్నాయి.

 శరద్ పవార్

శరద్ పవార్


ఇక ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరు వినిపిస్తోంది. ఈయన కాంగ్రెస్ వీడి.. ఎన్సీపీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని పదవీ వరించకపోవడంతో.. కనీసం రాష్ట్రపతి పదవీ ఊరిస్తోంది. పవార్ కాకుంటే లోక్ సభ మజీ స్పీకర్ మీరా కుమార్‌ను బరిలోకి దింపే అవకాశం ఉంది. ఈమె కూడా దళిత అభ్యర్థి కావడం విశేషం. సో మరోసారి దళితులకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. కానీ గెలవాలంటే మాత్రం తగినన్నీ ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంటుంది.

15న నోటిఫికేషన్15న నోటిఫికేషన్

15న నోటిఫికేషన్15న నోటిఫికేషన్


రాష్ట్రప‌తి ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్‌ను ఈ నెల 15న జారీ చేస్తామని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ ప్ర‌క‌టించారు. జూన్ 15 నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ప్రారంభ‌ం అవుతుంద‌ని చెప్పారు. ఈ నెల 29 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తామ‌ని, 30న నామినేష‌న్ల ప‌రిశీలన ఉంటుంద‌ని తెలిపారు. జులై 2 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌కమైన పోలింగ్‌ను జులై 18న నిర్వ‌హిస్తామని.. జులై 21న ఓట్ల లెక్కిస్తామని తెలిపారు.

English summary
these are the president of india candidate names. kerala governer arif mohammad khan and sharad pawer
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X