వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ డెసిషన్: ఆ మూడు సామాజిక వర్గపు ఓట్లే ఢిల్లీ పీటాన్ని డిసైడ్ చేస్తాయా..?

|
Google Oneindia TeluguNews

వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఇక ఏక్షణమైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొననుంది. ఓ వైపు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ తమ సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకుంటుండగా... బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కీలకంగా కొన్ని సామాజిక వర్గాలు మారనున్నాయి. ఢిల్లీలో ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఈ సామాజిక వర్గాల వారి ఓట్లే డిసైడ్ చేస్తాయి.

25 నుంచి 30శాతం పూర్వాంచల్‌ ప్రాంత ఓట్లు

25 నుంచి 30శాతం పూర్వాంచల్‌ ప్రాంత ఓట్లు

ఢిల్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మొత్తం ఓటరు 1.43 కోట్లు ఉన్నారు. ఇది 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం వద్ద ఉన్న రికార్డు. ఇందులో మహిళా ఓటర్లకంటే పురుషుల ఓట్లు 14 లక్షలు అధికంగా ఉన్నాయి. ఈ మొత్తం ఓట్లలో అధికంగా పూర్వాంచల్ , పంజాబీ, ముస్లిం సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలో ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే స్పష్టతనిస్తాయి. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో మూలాలు ఉండి ఢిల్లీలో స్థిరపడ్డ వారి ఓట్లు 25 నుంచి 30శాతం ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాలు కలిపి పూర్వాంచల్‌ అని పిలుస్తాము.

 పూర్వాంచల్ ప్రాంత ఓట్లు కేజ్రీవాల్‌కేనా..?

పూర్వాంచల్ ప్రాంత ఓట్లు కేజ్రీవాల్‌కేనా..?


పూర్వాంచల్ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు ఆదిలో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేవారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారంలో ఉన్న సమయంలో పూర్వాంచల్ ప్రాంత నేతలైన మహాబల్ మిశ్రాలాంటి వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఇక బీజేపీ విషయానికొస్తే అగ్రకులాలైన బనియా సామాజిక వర్గం వారి ఓట్లపైనే కమలం పార్టీ ఆధారపడుతుంది. అయితే 2013లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి తన విధానాలతో ముందుకురాగానే పూర్వాంచల్ ఓటర్లు చాలామంది కేజ్రీవాల్‌వైపు మళ్లారు. దీంతో రెండు సార్లు ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తొలిసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 49 రోజులు మాత్రమే ఉన్నింది. ప్రస్తుతం ఓటర్ల సంఖ్యను చూస్తే 25 నియోజకవర్గాల్లో పూర్వాంచల్ ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో మూడింట రెండో వంతు ఓట్లను పూర్వాంచల్ ఓటర్లే డిసైడ్ చేస్తారని స్పష్టంగా అర్థమవుతోంది.

 28 నుంచి 30 సీట్లలో పంజాబీల ప్రభావం

28 నుంచి 30 సీట్లలో పంజాబీల ప్రభావం

ఢిల్లీ ఓటర్ల సంఖ్యలో పంజాబీ ఓటర్లు దాదాపు 35శాతంగా ఉన్నారు. అయితే వీరు ఒక్క నియోజకవర్గం అని కాకుండా ఢిల్లీ నగరంలో పలు చోట్ల స్థిరపడ్డారు. 28 నుంచి 30 సీట్ల వరకు వీరు ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఢిల్లీలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంజాబీలు మొత్తం ఓటర్ల సంఖ్యలో 20శాతం వరకు ఉంటారు. మరో 8 నియోజకవర్గాల్లో పంజాబీ ఓటర్లు మరో 20శాతం ఉంటారు.అంటే పూర్వాంచల్ ప్రాంతపు ఓటర్లతో దాదాపుగా సమానంగా పంజాబీ ఓటర్లు ఉన్నారు.

 ఢిల్లీ జనాభాలో 12 నుంచి 13శాతం ముస్లింలు

ఢిల్లీ జనాభాలో 12 నుంచి 13శాతం ముస్లింలు

ఇక ఢిల్లీ జనాభా విషయానికొస్తే 12-13 శాతం మంది ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారున్నారు. ముస్లింలంతా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటు వేస్తే వీరి ప్రభావంతో కూడా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. 10 నియోజకవర్గాల్లో ముస్లింలు తమ సత్తా చాటే అవకాశం ఉంది. ఐదు నియోజకవర్గాల్లో 40శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు.చాందిని చౌక్, మతియా మహల్, బల్లిమరన్, ఓక్లా మరియు సీలంపూర్‌లలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడే పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. మరో ఐదు నియోజకవర్గాలు అయిన ముస్తాఫాబాద్, బాబర్‌పూర్, సీమాపురి, షాదారా మరియు రితాలాలో 30 నుంచి 40శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు.

 సిక్కు ఓటర్ల కోసం బీజేపీ తాయిలాలు

సిక్కు ఓటర్ల కోసం బీజేపీ తాయిలాలు

ఇక సిక్కు ఓటర్ల కోసం బీజేపీ తాయిలాలు ప్రకటిస్తోంది. అంతేకాదు 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను తిరిగి తెరపైకి తీసుకొస్తోంది. ఈ అంశంను రేకెత్తించడం ద్వారా కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలనే యోచనలో బీజేపీ ఉంది. అయితే సిక్కులు మాత్రం 2013లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అండగా నిలిచారు. 2015లో కూడా వారి మద్దతు అరవింద్ కేజ్రీవాల్ పార్టీకే ఇచ్చారు. ఇక కులపరంగా చూస్తే 40శాతం ఓటర్లలో అగ్రకుల హిందువులు ఉన్నారు. ఇందులో బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు 12శాతం ఉండగా..ఆ తర్వాత పంజాబీ ఖత్రీస్, రాజ్‌పుత్‌లు చెరో 7శాతంగా ఉన్నారు.జైనులు, బనియా, వైశ్య సామాజిక వర్గం వారు కలిపి 6శాతం ఉండగా మిగతా సామాజికవర్గాల వారు 8శాతంగా ఉన్నారు.

బీజేపీ సీఎం అభ్యర్థిగా మనోజ్ తివారీ..?

బీజేపీ సీఎం అభ్యర్థిగా మనోజ్ తివారీ..?

ఇక అభ్యర్థుల ఎంపికలో ఆయా పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువగా ఏ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారో ఆ సామాజిక వర్గం వారినే అభ్యర్థిగా పోటీకి నిలబెట్టేలా పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా మనోజ్ తివారీ వైపు కమలం పార్టీ మొగ్గు చూపుతుండగా... హర్దీప్ పూరీ, కేంద్ర మంత్రి పర్వేష్ వర్మల పేర్లను కూడా పరిశీలిస్తోంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం మధ్యతరగతి కుటుంబాలను, పేద వర్గాలను, పూర్వాంచల్, ముస్లిం ఓటర్లపైనే ఫోకస్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ బీజేపీ తప్పిదాలను హైలైట్ చేస్తూ యువతను, ముస్లిం వర్గాలను ఆకట్టుకుని తద్వారా బీజేపీ, ఆప్‌లకు చెక్ పెట్టాలని పావులు కదుపుతోంది.

మొత్తానికి ముక్కోణపు పోటీతో ఢిల్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారేలా కనిపిస్తున్నాయి.

English summary
Announcement for Delhi Assembly election may come any day. Term of the incumbent assembly expires in February 2020. Pending announcement of Delhi Assembly, all three contenders for power the Aam Aadmi Party (AAP), the Bharatiya Janata Party (BJP) and the Congress have hit the ground to woo the voters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X