నన్నుచూసి భయపడ్తున్నారు: మోడీపై రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. సభలో నేను మాట్లాడుతానని, కానీ ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం తనను చూసి భయపడుతోందని, అందుకే పార్లమెంట్‌లో జెఎన్‌యు అంశంపై తనను నోరు తెరవనివ్వదన్నారు. జెఎన్‌యు వివాదంలో రాహుల్ గాంధీ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంట్‌లో ఈ రోజు గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంటు బయట మాట్లాడారు. ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు.
లోకసభలో జెఎన్‌యు, హెచ్‌సియు ఘటన పైన స్వల్పకాలిక చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రతిపక్షంపై ధ్వజమెత్తారు. అఫ్జల్ గురుకు మీరు అండగా ఉంటే దేశమే మీకు తగిన బుద్ధి చెబుతుందన్నారు. అఫ్జల్ గురు ఉగ్రవాదా కాదా చెప్పాలని ప్రశ్నించారు. ఒకే ర్యాంకు, ఒకే పింఛన్ ఇచ్చింది ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు.












Click it and Unblock the Notifications