ఢిల్లీలో ఎన్ కౌంటర్: హతం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ మరో సారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. దుండగులు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దొంగ హతం అయ్యాడు. మరో దుండగుడికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులకు చిక్కిపోయాడు.
డీసీపీ సంజయ్ సింగ్ కథనం మేరకు పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో మారుతి హోండా కారును దుండగులు చోరీ చేశారు. తరువాత పారిపోతూ పోలీసుల కంటపడ్డారు. పోలీసులు లోంగిపోవాలని హెచ్చరించారు. అయితే దుండగులు కారు వేగంగా నడుపుతూ పారిపోవడానికి ప్రయత్నించారు.

చివరికి నగర శివార్లలోని కంజావాల స్టేషన్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దుండగుడు మరణించాడు. మిగిలిన వారు పారిపోయారు.
బుల్లెట్ గాయాలై పారిపోవడానికి వీలుకాక అభిషేక్ అనే యువకుడు సావిత్రి ఆసుపత్రి సమీపంలో కుప్పకూలిపోయాడు. అటు వైపు దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు అభిషేక్ ను గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన దుండగులు పారిపోయారని పోలీసులు తెలిపారు.
అయితే ఈ ఎన్ కౌంటర్ పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ దొంగ అక్కడికక్కడే మరణించాడు. మరో వ్యక్తికి గాయాలైనాయి. పోలీసులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పలువురు ఇది నకిలి ఎన్ కౌంటర్ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications