రాజధానిలో ఇంత దారుణమా ?, మండిపడుతున్న సీఎం, ఏం చేస్తారు !

న్యూఢిల్లీ: ఎవరైనా అవసరం ఉంటేనే ఆటోలో, క్యాబ్ లో వెలుతుంటారు. అవసరం ఉంటే చాలా మంది డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదని ఆటోలు, క్యాబ్ ల్లో వెలుతుంటారు. అత్యవసర పరిస్థితిలో క్యాబ్ లో వెలుతున్న వారిని నిత్యం రిద్దీగా ఉండే ప్రాంతంలో అడ్డగించి తుపాకులతో బెదిరించి వారిని నిలువు దోపిడీ చేసిన సంఘటన అక్షరాల దేశ రాజధానిలో జరిగింది.

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ లో జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ నిలువు దోపిడీ సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంబంధిత అధికారులు, పోలీసులపై మండిపడుతున్నారు.

Thieves

శనివారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నల్ వెలుతున్న ఓ క్యాబ్ ను కొందరు దుండగులు అడ్డుకున్నారు. కారు నిలిపిన తరువాత ఓ వ్యక్తి కారు ముందు సీటులో ఉన్న వ్యక్తులను రివాల్వర్లతో బెదిరించారు. అదే సమయంలో మరో వ్యక్తి వెనుక సీటులో ఉన్న వ్యక్తులకు రివాల్వర్ చూపించి మీరు కేకలు వేస్తే మిమ్మల్ని కైలాసానికి పంపిస్తామని, నోరు మూసుకుని కుర్చోవాలని బెదిరించారు.

తరువాత క్యాబ్ లో ఉన్న వాళ్లను రివాల్వర్లతో బెదిరించి వారి దగ్గర ఉన్న బ్యాగులు ఎత్తుకుని వెళ్లిపోయారు. నిందితులు క్యాబ్ ను అడ్డగించి నడిరోడ్డు మీద నిలువు దోపిడీ చేస్తున్న సమయంలో పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఆ సందర్బంలో నిందితులు కారులో ఉన్న వారికి రివాల్వర్ చూపించి బెదిరిస్తూ అక్కడి నుంచి పరారైనారు.

ఢిల్లీలో నడిరోడ్డు మీద రివాల్వర్లతో బెదిరించి నిలువు దోపిడీ చెయ్యడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ జనరల్ ను మార్చాని, ఢిల్లీలో మొత్తం అధికారం మాకే వస్తే అన్ని పరిస్థితుు చక్కదిద్దుకుంటాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని పోలీసు పవర్ మా చేతిలో లేకపోవడతోనే అసలు సమస్యలు వస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు మేము తగ్గమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+