దొంగలకు మోదీ పేరు : రాహుల్‌పై పరువునష్టం కేసు వేసిన సుశీల్
పాట్నా : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. పనిలోపనిగా ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రధాని మోదీని చౌకీదార్ చోర్ హై అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీతోపాటు నీరవ్ మోదీ, లలిత్ మోదీ పేర్లను ప్రస్తావిస్తూ దొంగలందరికీ మోదీ అనే పేరు ఎందుకుందని రాహుల్ వ్యాఖ్యానించారు.

పరువునష్టం దావా
ఈ నెల 13న ఓ బహిరంగ సభలో కూడా రాహుల్ మాట్లాడారు. దొంగలందరి పేర్లలో మోదీ అని ఎందుకుంది అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఓ బహిరంగ సభలో ఆ విధంగా మాట్లాడటం సరికాదన్నారు బీహర్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ. ఆ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయినందున దేశం మొత్తం ఆ కామెంట్లను విన్నదని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యలను నిరసిస్తూ సుశీల్ మోదీ పరవునష్టం కేసు వేశారు.
క్షోభకు గురయ్యాం
మోదీ పేరుతో ఉన్నవారు చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్నారని పిటిషన్ లో సుశీల్ గుర్తుచేశారు. బహిరంగ సభలో రాహుల్ అలా కామెంట్ చేయడంతో తనతోపాటు వారంతా బాధపడాల్సి వచ్చిందన్నారు. సుశీల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది కోర్టు. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications