హాలీవుడ్ సినిమా స్టైల్లో బెంగళూరులో 70 కేజీల బంగారు నగలు లూటీ, జస్ట్ రూ. 16 కోట్లు, బాత్ రూంలో !
బెంగళూరు: బెంగళూరు నగరంలో హాలీవుడ్ సినిమా స్టైల్లో ప్రసిద్ది చెందిన ఫైనాన్స్ కంపెనీలో 70 కేజీల బంగారు నగలు ఎత్తుకుపోయారు. ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చిన సిబ్బంది చోరీ జరగిన విషయం గుర్తించి లబోదిబో అంటూ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలను తలతన్నే విధంగా వాటికి ఏం తక్కువ కాదన్నట్లు రూ. 16 కోట్ల విలువైన బంగారు నగలు చోరీ కావడంతో బెంగళూరు పోలీసులు సైతం షాక్ కు గురైనారు.

పులకేశీనగర ఏరియా !
బెంగళూరు నగరంలోని పులకేశీనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగరాజపురంలో ముతూట్ ఫైనాన్స్ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ ఫైనాన్స్ సంస్థలో స్థానికులు బంగారు నగలు కుదవ పెట్టి వారి అవసరాలకు డబ్బులు తీసుకుంటున్నారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి ఫైనాన్స్ సంస్థ నిర్వహకులు లెక్కలు సరిచూసుకుని కార్యాలయానికి తాళం వేసి వెళ్లారు.

70 కేజీల బంగారు నగలు
మంగళవారం ఫైనాన్స్ సంస్థ సిబ్బంది కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలోని సేఫ్టీ లాకర్స్ ఉన్న రూంలోకి వెళ్లి చూడగా అక్కడి సిబ్బంది దిమ్మతిరిగిపోయింది. సేఫ్టీ లాకర్ లో ఉన్న 70 కేజీలకు పైగా బంగారు నగలు మాయం అయ్యాయని గుర్తించి లబోదిబో అంటూ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హాలీవుడ్ సినిమా స్టైల్లో !
ముతూట్ ఫైనాన్స్ కార్యాలయం బాత్ రూం పగలగొట్టి కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగులు మొదట అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చెయ్యకుండా వాటి కనెక్షన్ లు లాగేశారు. తరువాత గ్యాస్ కట్టర్ లు తీసుకుని సేఫ్టీ లాకర్ కు ఏర్పాటు చేసిన అలారమ్ కట్ చేశారు. తరువాత సేఫ్టీ లాకర్లలో ఉన్న 70 కేజీల బంగారు నగలు చోరీ చేసి బూత్ రూంలో నుంచి లోపలికి ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు.

జస్ట్ రూ. 16 కోట్లు అంతే !
లింగరాజపురంలోని ముతూట్ ఫైనాన్స్ సంస్థలో బంగారు నగలు కుదువ పెట్టుకుని డబ్బులు ఇస్తుంటారు. సోమవారం రాత్రి ఫైనాన్స్ సంస్థలో చోరీ అయిన బంగారు నగల విలువ సుమారు రూ. 16 కోట్లకు పైగా ఉంటుందని సంస్థ నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముతూట్ ఫైనాన్స్ లో బంగారు నగలు కుదువ పెట్టిన స్థానికులు ఆ సంస్థలో చోరీ జరిగిందని తెలుసుని అక్కడకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముతూట్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయంలో ఎక్కడ ఏమి ఉన్నాయి ? అనే విషయం పూర్తిగా తెలిసిన వాళ్లే చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications