తుపాకులు ఉన్నాయని ఇలాగే చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయి, సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ !

మణిపూర్: మణిపూర్‌లో గత నెల రోజులుగా జరుగుతున్న హింసాకాండ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. ఈ సందర్భంగా చిన్‌మంగ్‌ గ్రామంలో మూకుమ్మడిగా ఒకేసారి మూడు ఇళ్లకు నిప్పు పెట్టారు. గాయపడిన సైనికుడిని లిమాఖోంగ్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించామని, ఆర్మీ జవాను పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

హింసాత్మక ఘటనలపై మణిపూర్ సీఎం స్పందించారు. హింసను ఆపకపోతే పరిణామాలుంటాయని, ఈ గొడవల కారణంగా అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు నాశనం అవుతున్నాయని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆందోళనకారును తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మే 3న మతపరమైన హింస చెలరేగిన తర్వాత మొదటిసారిగా దాడులు చేయవద్దని, శాంతిభద్రతలను కాపాడుకుందామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు.

manipurviolence

ప్రధానంగా కుకీ మిలిటెంట్లు, హింసను ఆపాలని, లేదంటే జరగబోయే పర్యవసానాలను మీరే ఎదుర్కోవాలని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ హెచ్చరించారు. ఆయుధాలు, తుపాకులు కలిగి ఉన్న మైథీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరిపైనా దాడులు చేయవద్దని, మనం శాంతిని కాపాడాలని. త్వరలోనే మణిపూర్ సాధారణ స్థితికి వస్తుందని సీఎం బీరేన్ సింగ్ చెప్పారు.

మిజోరాం సీఎంతో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌తో చర్చలు జరిపారు. మిజోరాం సీఎం జోరాంతంగాతో ఫోన్‌లో బీరేన్ సింగ్ మాట్లాడారు. మిజోరంలో నివసిస్తున్న మైథీలు ఎదుర్కొంటున్న ఆందోళన గురించి నేను వారికి తెలియజేశాను మరియు వారి భద్రత గురించి వారు నాకు హామీ ఇచ్చారు అని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

manipurviolence

శాంతి కోసం బీరేన్ సింగ్ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా, అస్సాంకు చెందిన మైథేయి సంస్థ సోమవారం జాతీయ రహదారి-306పై ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేసింది. ఇది మిజోరం యొక్క జీవనాడి, రాష్ట్రాన్ని అస్సాంతో మరియు దేశంలోని మిగిలిన ప్రాంతాలను ఈ రహదారి కలుపుతోంది. మొత్తం మీద సీఎం బీరేన్ సింగ్ మనవితొ మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఆగిపోతాయా ?, లేదా ? అని వేచి చూడాలని అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+