అమృత్‌సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద మూడో పేలుడు: ఐదుగురు నిందితుల అరెస్ట్

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో మూడో పేలుడు సంభవించింది. గురువారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం పరిసరాల్లోని శ్రీ గురు రామ్‌దాస్ నివాస్ సమీపంలో పెద్ద శబ్దం వినిపించిందని, ఇది తక్కువ తీవ్రత కలిగిన పేలుడు అని పోలీసులు వెల్లడించారు. పేలుళ్లకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే పేలుడు వెనుక వారి ఉద్దేశమని పోలీసులు తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలో వరుస పేలుళ్లకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ అధ్యక్షుడు హర్జిందర్​ సింగ్ ధామీ ఆరోపించారు. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో కూడా గోల్డెన్​ టెంపుల్​ సమీపంలోనే మరో పేలుడు సంభవించింది. దీంతో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించేందకు వచ్చిన భక్తులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. భయాందోళనలకు గురయ్యారు.

 arrested

పేలుడుపై సమాచారం అందుకున్న పోలీస్​ అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీస్​ కమిషనన్​ నౌనిహాల్​ సింగ్​ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు.

'పేలుడు ఘటనను ధ్రువీకరిస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉంది. బాంబ్ స్క్వాడ్, ఫోరెనిక్స్ బృందాలు చేరుకున్నాయి. ఒక వ్యక్తి కాలికి చిన్న గాయమైంది' అని ఏడీసీపీ మెహతాబ్ సింగ్ తెలిపారు. ఘటనా సమయంలో అక్కడే డ్యూటీ చేస్తున్న ఓ స్వీపర్​​ మాట్లాడుతూ.. "నేను ఇక్కడ స్వీపర్‌ను. డ్యూటీ చేస్తుండగా పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. భారీగా పొగలు కమ్ముకున్నాయి' అని తెలిపారు.

కాగా, స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఓ పేలుడులో కొందరు బాలికలు సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

పేలుడుతో కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు తెలిపారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్​ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. అయితే స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. పేలుడు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులను విచారిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+