ముచ్చటగా మూడోసారి: ముఖేష్ అంబానీకి బెదిరింపు మెయిల్; ఈసారి ఏకంగా రూ.400కోట్లు డిమాండ్!!
భారతదేశంలోని ప్రముఖ వ్యాపార దిగ్గజం, ప్రపంచ కుబెరులలో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కి అగంతకుల నుండి బెదిరింపులు ఆగడం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ వరుసగా బెదిరింపు లేఖలను అందుకుంటున్నారు. తాము అడిగిన సొమ్ము ఇవ్వకుంటే చంపేస్తామంటూ దుండగులు వరుసగా ఆయనపై బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇటీవల ఇప్పటికే రెండుసార్లు బెదిరింపు మెయిల్స్ పంపిన అగంతకులు తమ మెయిల్స్ ను పట్టించుకోలేదని ముఖేష్ అంబానీ ని హెచ్చరించారు. ఈసారి ఏకంగా 400 కోట్ల రూపాయలు ఇవ్వాలని వారు మెయిల్ ద్వారా డిమాండ్ చేశారు. లేదంటే చంపేస్తామని బెదిరించారు. అత్యంత ప్రతిభావంతులైన షూటర్లు తమ వద్ద ఉన్నారని అగంతకులు పేర్కొన్నారు.

ఎంత సెక్యూరిటీని పెంచుకున్నా లాభం లేదని, పని పూర్తి చేయడానికి ఒకే ఒక స్నైపర్ సరిపోతాడు అంటూ మెయిల్లో పేర్కొన్నారు. ఇప్పటికైనా తాము అడిగిన డబ్బులు ఇచ్చి ప్రాణాలు కాపాడుకోవాలని హెచ్చరించారు. ఇదిలా ఉంటే గతవారం ముఖేష్ అంబానీ కి తొలిసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. అగంతకులు అందులో 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు.
ఇవ్వకపోతే ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరించారు. ఇక దీంతో అప్రమత్తమైన ముఖేష్ అంబానీ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఆపై ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు. ఆ తర్వాత కూడా దుండగుల నుంచి మరొక మెయిల్ అందింది. అందులో ఏకంగా 200 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ రెండు మెయిల్స్ కు స్పందించకపోవడంతో మళ్లీ తాజాగా మూడవ మెయిల్ పంపించిన అగంతకులు ఈసారి ఏకంగా 400 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. ముఖేశ్ అంబానీ కి కొనసాగుతున్న ఈ బెదిరింపు లేఖలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏ సర్వర్ నుండి ఈ మెయిల్స్ వస్తున్నాయన్నది దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీని భారీగా పెంచారు.












Click it and Unblock the Notifications