తప్పదు... దేశంలో కరోనా మూడో వేవ్ అనివార్యం... అలా చేస్తే దాని ప్రభావం తగ్గే అవకాశం...

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ కూడా అనివార్యమేనని కేంద్ర ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్,ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ పేర్కొన్నారు. అయితే మూడో వేవ్ ఎప్పుడు మొదలవుతుంది... ఎప్పుడు విజృంభిస్తుందన్నది కచ్చితంగా చెప్పలేమన్నారు. వైరస్ వేరియంట్స్ స్వభావం క్రమంగా మారుతున్న నేపథ్యంలో.. మూడో వేవ్‌కి అంతా సిద్దంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు కోవిడ్ వేరియంట్స్‌పై ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని... అయితే సైంటిస్టులు ఎప్పటికప్పుడు తగిన మార్పులతో వ్యాక్సిన్లను అభివృద్ది చేస్తూనే ఉండాలని సూచించారు.

Recommended Video

    Coronavirus Update : COVID Third Wave Inevitable అందుకే ఈ ఉపద్రవం... కఠిన చర్యలు || Oneindia Telugu
    వాటి వల్లే ఎక్కువ వ్యాప్తి...

    వాటి వల్లే ఎక్కువ వ్యాప్తి...

    'కేవలం కొన్ని సార్లు మాత్రమే వైరస్ వేరియంట్లు రోగ నిరోధక శక్తిని అంత త్వరగా తగ్గిస్తాయి. వైరస్‌లో సంభవించే అన్ని మార్పుల మ్యాప్‌ను మేము తయారు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా వైరస్ వేరియంట్స్‌ను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.' అని ప్రొఫెసర్ విజయ రాఘవన్ తెలిపారు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్స్ వల్లే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందన్నారు. ఇమ్యూనిటీ తగ్గడం,నిర్లక్ష్యపూరిత ధోరణి కారణంగా కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి జరుగుతోందన్నారు.

    మే 7 నాటికి పీక్స్‌కి...

    మే 7 నాటికి పీక్స్‌కి...

    ప్రొఫెసర్ ఎం.విద్యాసాగర్ మాట్లాడుతూ... మే 7 నాటికి దేశంలో కరోనా సెకండ్ వేవ్ పీక్స్‌కి చేరుతుందన్నారు. దేశం మొత్తాన్ని పరిగణలోకి తీసుకుంటే... ఈ వారం చివరి నాటికి.. అంటే మే 7 నాటికి దేశంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టవచ్చు. అయితే ఓవరాల్‌గా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ... కొన్ని రాష్ట్రాల్లో కేసులు పీక్స్‌కి చేరే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య పీక్స్‌కి చేరడం లేదా ఆ దశకి దగ్గరగా ఉందన్నారు. ఒకవేళ ఈ వారం చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గితే దేశానికి పెద్ద ఊరట లభించినట్లవుతుందన్నారు.

    అలా చేస్తే థర్డ్ వేవ్ ప్రభావం తగ్గవచ్చు...

    అలా చేస్తే థర్డ్ వేవ్ ప్రభావం తగ్గవచ్చు...

    'కోవిడ్ వ్యాప్తిని అంచనా వేసేందుకు మేము ఏడు రోజుల సగటును పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే రోజువారీ సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి రోజువారీ నంబర్‌ మాత్రమే గాక మారుతున్న సంఖ్యను కూడా గమనించాలి.'అని ప్రొఫెసర్ విద్యాసాగర్ అన్నారు. రెండో వేవ్‌లో కరోనా అసింప్టమాటిక్‌గా ఉండి టెస్టులు చేయించుకోని వారు ఉండవచ్చునని... ఆర్నెళ్ల పీరియడ్‌ వరకు వీరిలో రోగనిరోధక శక్తి ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మురంగా చేపట్టడం ద్వారా రోగనిరోధక శక్తిని కోల్పోయినప్పటికీ వైరస్ బారినపడకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. కోవిడ్ రిస్క్ ఉండేవారిని ముందుగానే గుర్తించి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా కోవిడ్ మూడో వేవ్ అంతగా ప్రభావం చూపకపోవచ్చునని తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+