ఆగస్ట్ లో భారత్ కు థర్డ్ వేవ్ ముప్పు .. సెప్టెంబర్ లో పీక్స్ కు ; ఎస్బిఐ రీసెర్చ్
దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ -19 యొక్క వినాశకరమైన కరోనా సెకండ్ వేవ్ తరువాత, మూడవ వేవ్ వచ్చే నెలలో భారతదేశాన్ని తాకవచ్చని ఎస్బిఐ రీసెర్చ్ వెల్లడించింది. ఆగస్టు 2021 నాటికి కరోనా థర్డ్ వేవ్ భారతదేశాన్ని తాకుతుందని పేర్కొంది. ఎస్బిఐ రీసెర్చ్ ప్రచురించిన నివేదికకు 'కోవిడ్ -19: రేస్ టు ఫినిషింగ్ లైన్' అని పేరు పెట్టారు. కరోనా మూడవ వేవ్ 2021 సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఈ నివేదిక వెల్లడించింది.
ఎస్బిఐ నివేదిక భారతదేశంలో రెండవ తరంగంలో కేసుల పెరుగుదల ఏప్రిల్ లో మొదలై ఇది మే 7 న గరిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడించింది. రెండవ వేవ్ ఏప్రిల్‌లో భారతదేశాన్ని తాకి మేలో గరిష్ట స్థాయికి చేరుకుందని , కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లోని లక్షలాది కుటుంబాలను ఛిద్రం చేసిందని వెల్లడించింది. ప్రస్తుత డేటా ప్రకారం, జూలై రెండవ వారంలో నిదానంగా పెరగటం మొదలై, భారతదేశం ఆగస్టు రెండవ వారం నాటికి క్రమంగా కేసులలో పెరుగుదల కనిపిస్తుందని ఎస్బిఐ నివేదిక పేర్కొంది. ఇక ఇది సెప్టెంబర్ లో పీక్స్ కు చేరుతుందని వెల్లడించింది.

కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదని, మళ్ళీ త్వరలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులతో పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . థర్డ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారకుండా ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు మాత్రం పొంచి ఉందని, అలెర్ట్ గా లేకుంటే సెకండ్ వేవ్ తరహాలో దెబ్బ తినే ప్రమాదం ఉందని అంటున్నారు.
గత 24 గంటల్లో 39,796 తాజా కోవిడ్ -19 కేసులతో పాటు 42,352 రికవరీలు, 723 మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో మొత్తం కోవిడ్ -19 కేసులు ఇప్పుడు 3,05,85,229 గా ఉండగా, మరణాల సంఖ్య 4 లక్షలకు పైగా పెరిగింది. భారతదేశంలో ఇప్పుడు 4.82 లక్షలకు పైగా క్రియాశీల కోవిడ్ -19 కేసులు ఉండగా, దేశం ఇప్పటివరకు 35 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ ను నియంత్రించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనసాగిస్తోంది.












Click it and Unblock the Notifications