ప్రతి భారతీయుడి కల: జైట్లీ బడ్జెట్‌పై ప్రధాని మోడీ ప్రశంస

న్యూఢిల్లీ: 2016-17 సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర బడ్జెట్‌ను సోమవారం పార్లమెంట్‌లో సమర్పించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోడీ తనదైన శైలిలో స్పందించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, రైతులు, మహిళలు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రధాని మోడీ అన్నారు.

ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ అద్భుతమైన బడ్జెట్‌ రూపొందించారంటూ అభినందనలు తెలియజేశారు. బడ్జెట్‌లో గృహ నిర్మాణ రంగంపై ప్రధాన దృష్టి పెట్టారని అన్నారు. తద్వారా ప్రతి భారతీయుడి సొంతింటి కల సాకారమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా ఈ బడ్జెట్‌ ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

This budget is about the dreams of the people: PM Modi

బడ్జెట్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలేనని, తాను ఈ విషయాన్ని పట్టించుకోనని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశంలోని ప్రతి వ్యవసాయ భూమికి నీరు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

2019 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఆయన చెప్పారు. అలాగే 2018 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. బడ్జెట్‌లో ఈ మేరకు కేటాయింపులు జరిగాయని ఆయన అన్నారు.

బీపీఎల్ కుటుంబాల్లో పొగ బారినపడి ఎంతో మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఉచితంగా దేశ వ్యాప్తంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశామని ఆయన చెప్పారు. పదవీ విరమణ తర్వాత సైనికులంతా 'ఒన్ ర్యాంక్ ఒన్ పెన్షన్' అందుకుని అందరూ సురక్షితంగా ఉండాలని ఆ విధానం అమలు చేశామని చెప్పుకొచ్చారు.

యువభారతం మరింతగా దూసుకెళ్లేందుకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు తెలిపారు. యువ పారిశ్రామిక వేత్తలను తయారు చేసేందుకు స్టార్టప్స్‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. రోజ్‌గార్ యోజన ద్వారా మరిన్ని సౌకర్యాలు అందజేస్తున్నామని చెప్పారు. అందరికీ ఒకే రకమైన ఫలాలు అందే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని చెప్పారు.

విద్యావ్యవస్థలో విలువలను పెంచేందుకు గ్రూపులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా అందరూ మరింత బాగా చదువుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ రూపకల్పనలో శ్రమ పడిన అరుణ్ జైట్లీని ఆయన కొనియాడారు. బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు.

బడ్జెట్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం

కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. 2016-17 బడ్జెట్ పేదలు, రైతులకు అనుకూలమైన బడ్జెట్ అని ప్రశంసలు కురిపించారు. బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం నిజంగా అభినందనీయమంటూ ప్రధాని మోడీకి, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+