నడిరోడ్డులో షూ పాలిష్ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి: ఓటర్ల ఆశీర్వాదం, నా అదృష్టంగా భావిస్తున్నా!

మధ్యప్రదేశ్: ఎన్నికల్లో విజయం సాధించడానికి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒటర్లను ప్రశన్నం చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓటర్లను ఆకర్షించడానికి వారి శక్తి మేరకు బహుమతులు ఇస్తుంటారు. మాకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటుంటారు. మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నడిరోడ్డులో స్థానిక ఓటర్లకు షూ పాలిష్ చేస్తూ ఇలా మీకు సేవ చెయ్యడమే అదృష్టంగా భావిస్తున్నా అంటున్నారు.

మధ్యప్రదేశ్ లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగుతన్నది. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రతి ఇంటికి తిరిగి శాసన సభ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు మనవి చేస్తున్నారు.

This candidate is polishing shoes to please voters in Madhya Pradesh

అయితే మధ్యప్రదేశ్ లో రాష్ట్రీయ అంజాన్ పార్టీ అభ్యర్థి శరద్ సింగ్ కుమార్ విన్నూతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆయన నియోజక వర్గంలో నడిరోడ్డు మీద కుర్చుని అటు వైపు వెలుతున్న స్థానికులకు షూ పాలిష్ చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో తనకే ఓటు వెయ్యాలని, తాను తప్పకుండా మీకు సేవ చేస్తానని మనవి చేస్తున్నారు.

ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అభ్యర్థి శరద్ సింగ్ కుమార్ తన పార్టీ గుర్తుకు ఎన్నికల సంఘం షూ గుర్తు కేటాఇచ్చిందని అన్నారు. ఇదే గుర్తును తాను అదృష్టంగా భావిస్తున్నానని, ప్రతి వ్యక్తికి ఉచితంగా షూ పాలిష్ చేస్తూ ఓటు వెయ్యాలని వేడుకుంటున్నానని శరద్ సింగ్ కుమార్ అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+