గడప గడపకూ వెళ్లండి-బీజేపీ ఎంపీలకు మోడీ సలహా-జగన్ బాటలోనే !

తొమ్మిదేళ్ల ఎన్డీయే సర్కార్ పాలనపై జనంలో ప్రజావ్యతిరేకతను తట్టుకునేందుకు గడప గడపకూ వెళ్లి ఓటర్లకు చేరువ కావాలని ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు సలహా ఇచ్చారు.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వాతావరణం వచ్చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో వైసీపీ వంటి పార్టీలు గడప గడపకూ ప్రభుత్వం వంటి కార్యక్రమాలు చేపడుతుండగా.. ఇప్పుడు జాతీయస్దాయిలోనూ ప్రధాని మోడీ బీజేపీ ఎంపీలకు దాదాపు ఇలాంటి పిలుపే ఇచ్చారు.

ఇవాళ బీజేపీ ఎంపీలతో నిర్వహించిన భేటీలో ప్రధాని మోడీ వారికి కీలక సూచనలు చేశారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు బీజేపీ ఎంపీలు జనంలోకి విస్తృతంగా వెళ్లాలని ప్రధాని మోడీ సూచించారు. ఓటర్లకు బీజేపీ ఎంపీలు చేరువకాగలిగితే ప్రజా వ్యతిరేకత అనేదే ఉండదని మోడీ వారికి స్పష్టం చేశారు. ఇందుకోసం తక్షణం ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లి జనంతో మమేకం కావాలన్నారు.

this how to overcome anti-incumbency.. pm modis mantra to bjp mps to win 2024 polls

తాజాగా పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రసంగం తర్వాత ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఇది ఎన్నికల బడ్జెట్ అని చెప్పే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఓటర్లను చేరువకావడం వల్ల లభించే ప్రయోజనాలపై ఎంపీలకు పలుమార్లు మోడీ దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. కేవలం 400 రోజులు మాత్రమే ఉందని, ఈ సమయంలో ప్రజా సేవలు మెరుగుపర్చడంతో పాటు వారికి అన్నివిధాలా చేరువ కావాలని మోడీ కోరారు. సమాజంలో ప్రతీ వర్గానికి చేరువ కావాలని మోడీ సూచిస్తున్నారు.

తాజాగా గతేడాది డిసెంబర్లో బీజేపీ నిర్వహించిన సర్వేల్లో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి గడ్డు పరిస్దితులు ఉంటాయని భావిస్తున్న సీట్ల సంఖ్య 144 నుంచి 160కి పెరిగినట్లు తేలింది. అప్పటి నుంచి ప్రధాని మోడీతో పాటు బీజేపీ పెద్దలు కూడా దీనిపై ఆందోళన చెందుతున్నారు. మోడీ అయితే బీజేపీ ఎంపీలతో వరుస భేటీలు నిర్వహిస్తూనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+