Colonel Santosh Babu: కల్నల్‌నే టార్గెట్ చేశారా..? గాల్వన్ ఘటనలో వెలుగులోకి నిజాలు
కల్నల్ సంతోష్ బాబు.. ప్రస్తుతం దేశం మొత్తం తలుచుకుంటున్న పేరు. గాల్వాన్ వ్యాలీలో భారత్ - చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరుడయ్యారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడు. సంతోష్ బాబుతో సహా ఆ ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులయ్యారు. జూన్ 15వ తేదీన సంతోష్ బాబు ఎలాంటి సాహసాన్ని ప్రదర్శించారు..? ముందుండి తన ట్రూప్స్‌ను ఎలా నడిపారు..? ఆ రోజు రాత్రి ఏం జరిగింది..?
Recommended Video

చైనా ఆక్రమణను ప్రశ్నించిన కల్నల్
కల్నల్ సంతోష్ బాబు.. భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణలో అమరుడయ్యారు. జూన్ 15వ తేదీ రాత్రి వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణలో చైనా ఆక్రమణను ప్రశ్నించారు. చైనా బలగాలు వాస్తవ నియంత్రణ రేఖ దగ్గరకు చొచ్చుకువస్తున్న సమయంలో వారితో చర్చలు జరిపారు. ఎంతో మర్యాదపూర్వకంగా చర్చలు జరుపుతూనే రేఖ దాటి రావొద్దనే విషయంపై చాలా బలంగా నిలబడ్డారు. కానీ డ్రాగన్ కంట్రీ బలగాలు మాత్రం మర్యాద తప్పి ప్రవర్తించాయి. కల్నల్‌పై రాళ్లు రువ్వారు. అయినప్పటికీ ఆ ప్రదేశం నుంచి కల్నల్ సంతోష్ బాబు వెళ్లలేదు సరికదా మరింతగా అడ్డుకున్నారు. అంతేకాదు తన బృందంతో పాటు అక్కడే ఉన్నాడు.

చర్చలు జరిపిన కల్నల్ సంతోష్ బాబు
బీహార్ ఇన్‌ఫాంటరీ 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు కల్నల్ సంతోష్ బాబు. గాల్వాన్ వ్యాలీలో 14వ పాట్రోలింగ్ పాయింట్‌కు అవతలే చైనా బలగాలు ఉండేలా చూడాలని కల్నల్ సంతోష్ బాబుకు టాస్క్ అప్పగించడం జరిగింది. చైనా బలగాలు అక్కడ నుంచి వెనక్కు మళ్లిన తర్వాత వ్యక్తిగతంగా తాను నివేదిక ఇవ్వాలని పై అధికారులు సూచించారు. ఈ 14వ ప్యాట్రోలింగ్ పాయింట్ వద్దే జూన్ 6వ తేదీన భారత్-చైనా దేశాల మధ్య మిలటరీ చర్చలు జరిగాయి. అంతకుముందు నుంచి ఇరు దేశాల సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద మోహరించి ఉన్నారు. ఇక చర్చలు ముగిసిన తర్వాత చైనా బలగాలు అక్కడి నుంచి వెనక్కు మళ్లాయి. వారి టెంట్లను అక్కడ నుంచి తొలగించాయి. ఆ సమయంలో కల్నల్ సంతోష్ బాబు కూడా తన ర్యాంకు స్థాయి చైనీస్ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం.

అనుమానం వ్యక్తం చేసిన కల్నల్
అయితే జూన్ 14 ఒక్క సారిగా చైనా బలగాలు వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఒక పోస్టును ఏర్పాటు చేశాయి. అయితే ఇది అక్రమం అని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కల్నల్ సంతోష్ బాబు చైనా సైనికాధికారులతో వాదించారు. జూన్ 6వ తేదీన జరిగిన చర్చల మేరకు నడుచుకోవాలని పదేపదే చెప్పారు. సాధారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తితే మేజర్ ర్యాంక్ స్థాయి ఉన్న వ్యక్తులు మాట్లాడాల్సి ఉంటుందని సమాచారం. అయితే కల్నల్ సంతోష్ బాబు ముందుండి చొరవ తీసుకుని తన టీమ్‌తో అక్కడకు చేరుకున్నారు. తీరా అక్కడకు చేరుకోగానే కల్నల్ ఒక విషయాన్ని గమనించినట్లు తెలుస్తోంది. ప్రతిరోజు అక్కడ గస్తీ ఉండే చైనా సైనికులు కాకుండా కొత్త వారు అక్కడ ఉండటం గమనించారు. వీరంతా స్వల్ప వ్యవధికాలంలోనే అక్కడకు చేరుకున్నారు. భారత సైనికులు రోజు మాట్లాడే చైనా సైనికులు వారు కాదని గుర్తించారు. అక్కడ పోస్టును ఎందుకు ఏర్పాటు చేశారని కల్నల్ సంతోష్ బాబు ప్రశ్నించారు.

మాట్లాడుతుండగానే చైనా సైనికుడు ఒకడు..
కల్నల్ సంతోష్ బాబు ప్రశ్నించడంతో వెంటనే చైనా సైనికుడు ఒకడు కల్నల్ బాబును తోసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు చైనీస్ భాషలో దూషించినట్లు కూడా సమాచారం. తమ కమాండింగ్ ఆఫీసర్‌పై చైనా సైనికుడు చేయి చేసుకోవడం చూసిన సైనికుల రక్తం మరిగిపోయింది. అయితే సంయమనం పాటించాలని కల్నల్ సంతోష్ బాబు వారికి సూచించారట. ఇక చైనీస్ బలగాలు జవాన్లపై రాడ్లతో దాడికి దిగడంతో భారత జవాన్లు కూడా ప్రతిదాడి చేశారు. ఇక అప్పటికే చీకటి పడిపోయింది. దీంతో అప్పటికే భారీ సంఖ్యలో గాల్వాన్ నది తీరంలో నక్కి ఉన్న చైనా బలగాలు ముందుకొచ్చాయి. భారత జవాన్లపై రాళ్లతో దాడి చేశారు. రాత్రి 9 గంట సమయంలో కల్నల్ సంతోష్ బాబు తలకు ఓ భారీ సైజులో ఉన్న రాయి తగలడంతో ఒక్కసారిగా నదిలోకి పడిపోయారు. అయితే కల్నల్ సంతోష్ బాబును లక్ష్యంగా చేసి దాడి చేసినది కాదనే వాదన వినిపిస్తోంది. వరుసగా రాళ్లదాడి చేసినప్పుడు అందులో ఒకరాయి కల్నల్ తలకు తగిలి ఉంటుందనే అంచనా

నదిలో పడిపోయిన జవాన్లు
ఇక రెండో ఘర్షణ దాదాపు 45 నిమిషాలపాటు సాగింది. ఇక ఈ సమయంలోనే మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘర్షణ వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల జరిగాయి. ఈ సన్నివేశం ఎవరైనా చూస్తే రెండు వర్గాలు గొడవపడుతున్నారేమో అన్నట్లుగా ఉన్నిందట. దాదాపు 300 మంది బృందాలుగా విడిపోయి దాడి చేశారు. ఇక ఘర్షణ ముగియడంతో ఇటు భారత్ అటు చైనా సైనికుల మృతదేహాలు నదిలో పడిపోయాయని తెలుస్తోంది. వీరిలో కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహంతో పాటుగా ఇతర జవాన్ల పార్థీవదేహాలను కూడా నదిలోనుంచి భారత భూభాగంలోకి సైనికులు తీసుకొచ్చారు. అయితే కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు ముందుగా ఊహించినట్లు అక్కడికి చేరుకున్న చైనా బలగాలు తాము రోజు మాట్లాడే సైనికులు కాదని కొత్త బలగాలు స్వల్ప వ్యవధిలోనే అక్కడికి చేరుకున్నాయనేది నిజమైంది. ఇక వారి దాడిలో కల్నల్ మృతి చెందడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిందని సమాచారం.
-
Hormuz: హార్ముజ్ లో అసలు నష్టం భారత్ కే? కేంద్రం షాకింగ్ ..! -
ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్ -
Video: మెట్రోలో రక్తపు వాంతులు, ప్రపంచాన్ని కదిలించిన దృశ్యం! -
మృగంలా మారిన భర్త.. భార్య ముక్కు కొరికి.. చివరకు !! -
కొత్త ఫోన్ లాంఛ్ చేసిన "Honor".. కిర్రాక్ ఫీచర్స్ ! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications