కరోనా సెకండ్ వేవ్ కాదు... ఇదొక సునామీ... తరుముకొస్తోంది... కేంద్రం వద్ద యాక్షన్ ప్లాన్ ఉందా? : ఢిల్లీ హైకోర్టు

ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టు పదేపదే కేంద్రానికి చెబుతూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఘాటైన వ్యాఖ్యలతో కేంద్రంపై ఫైర్ అయిన హైకోర్టు... తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దాని జాడ లేదు... అది ఎప్పుడొస్తుందో కాస్త చెప్పండి...' అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ సునామీలా తరుముకొస్తుందని... మున్ముందు పరిణాలకు కేంద్రం సిద్దంగా ఉందో లేదో చెప్పాలని పేర్కొంది.

అలా చేస్తే సహించేది లేదు : ఢిల్లీ హైకోర్టు

అలా చేస్తే సహించేది లేదు : ఢిల్లీ హైకోర్టు

ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని పలు ఆస్పత్రులు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. సంబంధిత అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం... ఆక్సిజన్ ఎప్పుడొస్తుందో తెలియకపోవడంతో పేషెంట్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని కోర్టుకు నివేదిస్తున్నాయి. తాజాగా మరో ఆస్పత్రి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు... కేంద్ర,రాష్ట్ర,స్థానిక అధికారులెవరైనా సరే ఆక్సిజన్‌ను బ్లాక్ చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. అలాంటి అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాలన్నారు.

ఎప్పుడొస్తుందో చెప్పండి...

ఎప్పుడొస్తుందో చెప్పండి...

'ఢిల్లీకి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించినట్లు చెప్పారు.కానీ ఇప్పటివరకూ అది ఢిల్లీకి చేరలేదు. ఎప్పుడు అందుతుందో కచ్చితమైన తేదీ చెప్పండి. మీ చర్యలను ఎవరూ తప్పు పట్టట్లేదు... కానీ ఇప్పటివరకూ ఢిల్లీకి ఆ 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ చేరలేదన్నది వాస్తవం... ఆక్సిజన్ కొరత కారణంగా జనాలు ఇలా చనిపోవడాన్ని మేము చూస్తూ ఊరుకోము.' అని హైకోర్టు పేర్కొంది. ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

ఇది సెకండ్ వేవ్ కాదు... ఇదొక సునామీ...

ఇది సెకండ్ వేవ్ కాదు... ఇదొక సునామీ...

'ఇది కరోనా సెకండ్ వేవ్ కాదు.. ఇదొక సునామీ... ఇప్పటికీ ఇంకా పీక్స్‌కి చేరలేదు. మే నెల మధ్య వారానికి పీక్స్‌కి చేరవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చర్యలతో సన్నద్దమవుతోందా...' అని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పీక్స్‌కి చేరుకునే దశలో కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని ఆదేశించింది. 'రాబోయే వారాల్లో కేసులు మరింత పెరగవచ్చు. భయపెట్టేందుకు ఇలా చెప్పట్లేదు.. మరింత దారుణ పరిస్థితులకు మనం సిద్దం కావాలని చెబుతున్నాం. ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్నాయి.' అని హైకోర్టు పేర్కొంది.

ఆక్సిజన్ అందక 20 మంది పేషెంట్లు మృతి

ఆక్సిజన్ అందక 20 మంది పేషెంట్లు మృతి

శుక్రవారం(ఏప్రిల్ 23) సర్ గంగారాం ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 25 మంది కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ విషాదం మరవకముందే తాజాగా జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 20 మంది కరోనా పేషెంట్లు ఆక్సిజన్ అందక మృతి చెందారు. అంతేకాదు,ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ మరో గంట మాత్రమే వస్తుందని... అది కూడా అయిపోతే 200 మంది పేషెంట్ల ప్రాణాలకు ప్రమాదమని ఆస్పత్రి సిబ్బంది ఎస్ఓఎస్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రెండు రోజుల క్రితమే ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓవైపు జనం చస్తుంటే... ఆక్సిజన్ కొరతను నివారించడంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. ఇప్పటికీ ఢిల్లీలోని పలు ఆస్పత్రులు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+