బుద్ధుడు, మహాత్ముడు వంటి శాంతికాముకులు జన్మించిన నేల- అభినందన సభలో మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- తన మూడు దేశాల పర్యటనను ముగించుకున్నారు. జపాన్, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని ఈ తెల్లవారు జామున భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పాలం విమానాశ్రయంలో ఆయనను ఘనంగా సన్మానించింది భారతీయ జనతా పార్టీ. ఎయిర్‌పోర్ట్ వద్ద భారీ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
#WATCH | I want to tell you that While speaking about the culture and great tradition of India, never get immersed in slavery mentality, speak with courage. The world is eager to listen. The world agrees with me when I say that attack on our pilgrimage sites is not acceptable: PM… pic.twitter.com/tBHxXIuoJP
— ANI (@ANI) May 25, 2023
జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి.. తదితరులు పాల్గొన్నారు. విమానాశ్రయం నుంచి వేదిక వద్దకు చేరుకున్నారు మోదీ. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని జాతీయ పతాకాలను చేతబట్టుకుని పార్టీ కార్యకర్తలకు ఆయనను ఘనంగా స్వాగతించారు. దారి పొడవునా పూలు చల్లారు.

అనంతరం ఈ సభను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి విదేశీయులు గొప్పగా చెప్పుకొంటోన్నారని అన్నారు. ఈ దేశం అతిగొప్ప సాంస్కృతిక వారసత్వ సంపదను ఇచ్చిందని, దాని గురించి స్వేచ్ఛగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల విషయాన్ని ఆ దేశ ప్రధాని ముందే ఖండించానని గుర్తు చేశారు.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా, ఆధ్యాత్మికతను వెదజల్లే ఆలయాలపై దాడులు శ్రేయస్కరం కాదని తేల్చి చెప్పానని, వివిధ ప్రపంచ దేశాధినేతలు ఈ విషయాన్ని అంగీకరించారని మోదీ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ఈ యావత్ ప్రపంచానికి వ్యాక్సిన్లను అందజేసిన ఘనత భారత్‌కు ఉందని, శతృవులు సైతం వాటిని వినియోగించుకుంటోన్నాయని పేర్కొన్నారు.
#WATCH | The people here asked me why I gave the vaccines to the world. I want to say that this is the land of Buddha, Gandhi. We care even for our enemies... Today the world wants to know what India is thinking: PM Modi pic.twitter.com/Ti34IUSfzm
— ANI (@ANI) May 25, 2023
భారత్- గౌతమ బుద్ధుడు, మహాత్మ గాంధీ.. వంటి శాంతికాముకులు జన్మించిన నేల అని పేర్కొన్నారు. శత్రువుల పట్ల కూడా ఉదారంగా వ్యవహరించడమే ఈ మట్టి గొప్పతనమని వ్యాఖ్యానించారు. భారత్- ఏం ఆలోచిస్తోందనే విషయాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తోన్నాయని, అది కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీతో రుజువైందని అన్నారు.
సిడ్నీలో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమానికి ఆ దేశ ప్రధాని మాత్రమే కాకుండా మాజీ ప్రధాని, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారని, అదే నిజమైన ప్రజాస్వామ్య బలం అని మోదీ అన్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసుకున్న ఓ కార్యక్రమానికి ఆ దేశ పార్లమెంట్ తరలి రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. భారతీయుల పట్ల వారిచ్చే గౌరవాన్ని ఇది ప్రతిబింబించిందని మోదీ చెప్పారు.
#WATCH | The PM of Papua New Guinea said that for him the PM is 'Vishwa Guru'. Australian PM called PM Modi 'The Boss'... Today the world is seeing a new India because of the leadership of PM Modi: External Affairs Minister Dr S Jaishankar pic.twitter.com/5umf4Q4H9e
— ANI (@ANI) May 25, 2023
దేశంలో పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల.. ప్రపంచం ఎదుట భారతీయ గొప్పదనాన్ని ధైర్యంగా, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లభించిందని మోదీ పేర్కొన్నారు. దీని గురించి మాట్లాడేటప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదని అన్నారు. ఎవరేమనుకుంటారోననే సంకోచాన్ని, బానిస భావాలను వీడనాడాలని మోదీ సూచించారు.
జేపీ నడ్డా, కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ- పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపె.. మోదీకి పాదనమస్కారం చేయడం ఈ దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తోన్నామని అన్నారు. మోదీని విశ్వగురుగా అభివర్ణించారని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రధాని కూడా మోదీని ది బాస్..గా సంబోధించారని చెప్పారు. మోదీ నాయకత్వాన్ని వహిస్తోండటం వల్లే ప్రపంచం కొత్త భారతదేశాన్ని చూస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications