ఐటీ కంపెనీలు సిఎస్ఆర్ నిధులన్నీ విద్యపైనే: నాస్కామ్
న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన ఐటీ కంపెనీలు సిఎస్ఆర్ ( కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీ )నిధులను ఎక్కువగా విద్యపై ఖర్చు చేస్తున్నారని నాస్కామ్ పౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. సిఎస్ఆర్ నిధుల్లో ఎక్కువగా విద్యపైనే చిన్న చిన్న ఐటీ సంస్థలు కూడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నాయి.
ఇండియాకు చెందిన ఐటీ సంస్థలు విద్యపై కేంద్రీకరించాయి. కార్పోరేట్ సంస్థలు తమ లాభాల్లో కొంత భాగాన్ని సిఎస్ఆర్ కింద వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో ఐటీ సంస్థలు ఇతరత్రా రంగాల్లో ఎక్కువ నిధులను ఖర్చు చేస్తున్నా.... విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
అయితే విద్యపై కార్పోరేట్ సంస్థలు నిధులను కేటాయించడం వల్ల భవిష్యత్ తరాలకు ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.విద్యపై చేసే ఖర్చు భవిష్యత్ తరాలకు ఇబ్బందులు లేకుండా చేయనుంది.

ఐటీ కంపెనీలు విద్యపై అధిక నిధులు
ఐటీ కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను అత్యధికంగా విద్యా రంగంపై వెచ్చిస్తున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బహుళజాతి సంస్థల్లో 76 శాతం కంపెనీలు మానవ వనరులను అందించే విద్యపై ఖర్చు చేసినట్టు వెల్లడైంది.నాస్కామ్ ఫౌండేషన్ నిర్వహించిన అథ్యయనంలో ఐటీ కంపెనీలు విద్యపైనే తమ సీఎస్‌ఆర్ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారని తేలింది.

లింగ సమానత్వంపై 18 శాతం నిధులు
లింగ సమానత్వంపై 18 శాతం సంస్థలు సిఎస్ఆర్ నిధులను ఖర్చు చేశాయి. ఆకలి, పేదరిక నియంత్రణపై 12 శాతం సంస్థలు అధికంగా నిధులు వెచ్చించినట్టు తేలింది.ఐటీ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నాయని నాస్కామ్ ఫౌండేషన్ చీఫ్ శ్రీకాంత్ సిన్హా చెప్పారు.

విద్యపై చిన్న ఐటీ సంస్థలు ఖర్చు
రూ 100 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన చిన్న సంస్థలు సైతం సీఎస్‌ఆర్ నిధులను సమర్థవంతంగా ఖర్చు చేశాయని నాస్కామ్ అథ్యయనం వెల్లడించింది.విద్యపై సీఎస్‌ఆర్ నిధుల్లో 50 శాతం కంటే తక్కువగా వెచ్చించినట్టు కేవలం 5 శాతం ఐటీ కంపెనీలే పేర్కొన్నాయని తెలిపింది.

ప్రభుత్వ ఎజెండాకు అనుగుణంగా వర్క్
సామాజిక అభివృద్ధిపై ఐటీ, బీపీఎం సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయని నాస్కామ్ ఫౌండేషన్ చీప్ శ్రీకాంత్ సిన్హా అభిప్రాయపడ్డారు..ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా సీఎస్‌ఆర్ కార్యక్రమాలను అత్యున్నత సాంకేతిక సాయంతో ఆయా నిధులను బాధ్యతాయుతంగా కంపెనీలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత, బహుళజాతి కంపెనీల్లో 62 శాతం సంస్థలు తమ సీఎస్‌ఆర్ నిధుల్లో నూటికి నూరు శాతం విద్యపైనే వెచ్చించాయని ఈ సర్వేలో వెల్లడైంది.












Click it and Unblock the Notifications