Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇదెలా సాధ్యం అబ్బా: మార్కుల్లో రికార్డు సృష్టించిన కుర్రాడు..ఇప్పుడొక మినీ సెలబ్రిటీగా..!

ఈ రోజుల్లో పిల్లలను పిల్లలనడం కంటే పిడుగులు అనాలనిపించేలా ఉన్నారు. చదువుల్లో పోటీ మీద పోటీ పడి చదువుతున్నారు. ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండేది. కాలక్రమంలో ఒక విద్యార్థి ఉత్తీర్ణతశాతం 90శాతంకు పైనే ఉంటోంది. దీంతో వారికి చదువుచెప్పిన గురువులు వారిని కన్న తల్లిదండ్రులు తోటి స్నేహితులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. అయితే అందరూ మార్కులు ఎక్కువగానే తెచ్చుకుంటున్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ ముంబైలో ఓ కుర్రాడు మాత్రం తాను సాధించిన మార్కులతో ఒక్కరోజులోనే ఒక మినీ సెలబ్రిటీగా మారాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు.. ఆయన సాధించిన మార్కులు ఏంటి..?

అన్ని సబ్జెక్టుల్లో ఒకే రకమైన మార్కులు

అన్ని సబ్జెక్టుల్లో ఒకే రకమైన మార్కులు

ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడి పేరు అక్షిత్ జాధవ్. ముంబైలోని శాంతినగర్ హైస్కూల్‌లో చదవుతున్నాడు. అయితే ఈ కుర్రాడు సాధించిన ఘనత ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ముంబైలో ఈ కుర్రాడు ఎవరా అని చాలామంది వేట కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఇంతకీ జాదవ్ సాధించిన ఘనతేంటో తెలుసా... మహారాష్ట్ర సర్కార్ నిర్వహించిన 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు సాధించి పాస్ అవడం.

 వైరల్‌గా మారిన మార్కుల జాబితా

వైరల్‌గా మారిన మార్కుల జాబితా


ఈ మధ్యకాలంలో విద్యార్థులంతా 90శాతంకు పైగా మార్కులు సాధిస్తుంటే... జాదవ్ మాత్రం ప్రతి పేపర్లో 35 మార్కులు సాధించాడు. ఇలా సాధించడంతో ప్రతి ఒక్కరూ ఈ కుర్రాడి గురించే చర్చించుకుంటున్నారు. ఈ కుర్రాడి మార్క్‌లిస్టు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు జాదవ్. పర్ఫెక్ట్ మార్కులతో పాస్ అయ్యాడని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు. ఈ ఘనత ఇక మీదట ఎవరూ సాధించలేరని మరికొందరు వ్యాఖ్యానించారు.ఇక జాదవ్ తల్లిదండ్రులు తన కొడుకు పాస్ అవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అదేసమయంలో భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకున్నారు.

Recommended Video

    RGV Reacts To Amitabh Bachchan Testing Positive For Covid-19 || Oneindia Telugu
    ఫుట్‌బాల్ ఆటగాడిగా తయారవుతాడు

    ఫుట్‌బాల్ ఆటగాడిగా తయారవుతాడు


    ప్రతీ విద్యార్థి తమకు ఇచ్చిన ప్రశ్నను బాగా రాసి మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తారని తన కొడుకు కూడా మంచి మార్కులు సాధించేందుకే ప్రయత్నించాడని అయితే తక్కువ మార్కులతో పాసై గట్టెక్కాడని తండ్రి గణేష్ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రైవేటుగా పరీక్షలు రాశాడని అయితే ఫుట్‌బాల్ బాగా ఆడుతాడని తల్లి అరుణ చెప్పింది. భవిష్యత్తులో మంచి ఫుట్‌బాల్ ఆటగాడిగా తయారు అవుతాడని జాదవ్ తల్లి అరుణ విశ్వాసం వ్యక్తం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+