బామ్మా నీకు సలాం: నష్టాలు వచ్చినప్పటికీ కష్టకాలంలో ఇడ్లీలతో కడుపు నింపుతూ..!
కరోనావైరస్ దేశానికి తీరని నష్టం చేకూర్చిందన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అదే సమయంలో ఈ వైరస్ ఎన్నో పాఠాలను నేర్పింది. సాటి మనిషికి సహాయ పడటం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, మానవత్వం చూపించి తమకున్న దానిలో ఇతరులకు పంచిపెట్టడంలాంటి ఎన్నో పాఠాలను నేర్పింది. తమకు లేకపోయినప్పటికీ ఉన్నదాంట్లో ఇతరులకు పంచిపెట్టే మంచి గుణాన్ని ఈ కరోనా కష్టకాలం నేర్పింది. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు దర్శనమిస్తూనే ఉన్నాయి. మనకోసం రోడ్లపై ఎండనక వాననక నిల్చుని డ్యూటీలు చేస్తున్న పోలీసులకు నిత్యం ఎవరో ఒకరు భోజనం పెడుతున్న వార్తలను చూస్తున్నాం. ఇక పేదవారి కడుపులను నింపుతున్న వారిని చూస్తున్నాం. ఇలాంటి కథే ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది.
తమిళనాడులోని కమలతల్ అనే ఓ బామ్మ తనకు తోచినంతలో సహాయం చేస్తోంది. కరోనావైరస్‌తో చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను ఆదుకుంటోంది. తాను చేసిన ఇడ్లీలను వలస కూలీలకు పెడుతూ ఎంతో పుణ్యం కట్టుకుంటోంది. కమలతల్ అనే ఈ బామ్మ ఇడ్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. కానీ ఈ కష్ట సమయంలో ఆమె వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే ఉంది. అయినప్పటికీ ఆమె వెనకడుగు వేయలేదు. సాధారణ రోజుల్లో ఇడ్లీలు అమ్మేదానికంటే ఇప్పుడు మరింత తక్కువగా అమ్ముతోంది. కేవలం రూపాయికే ప్లేటు ఇడ్లీని అమ్ముతోంది. అందుకే ఈ బామ్మను ఇడ్లీ అమ్మ అని మరో పేరుతో పిలుస్తారు అక్కడి ప్రజలు. ఆమె ఇడ్లీల వ్యాపారం నష్టాల్లో నడుస్తోందని తెలిసినప్పటికీ ధరలను మాత్రం పెంచేందుకు ఒప్పుకోదు. ఎందుకంటే పేదవారు ఆకలితో ఉండటం తాను చూడలేనని చెప్పేస్తుంది ఈ బామ్మ.

గత 30 ఏళ్లుగా ఇడ్లీలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది ఈ 80 ఏళ్ల బామ్మ. ఇక కరోనావైరస్ మహమ్మారి కోరలు చాచినప్పటి నుంచి ఈ బామ్మ వ్యాపారం మరింతగా నష్టాల్లో కూరుకుపోయింది. అయితే ఈ సమయంలో ఆమెను ఆదుకునేందుకు వలస కూలీలు కూడా సహాయం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. కొందరైతే ఇడ్లీ తయారీకి కావాల్సిన వస్తువులను పంపుతున్నారని గుర్తు చేసుకుంది. వారు పంపుతున్న సరుకులతో ఇడ్లీలు తయారు చేసి వలస కూలీలకు, పేద వారికి ఒక్క రూపాయికే అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఆ బామ్మ కథ గతేడాది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సారి మాత్రం కరోనా కాటుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ తాను నష్టపోతున్నట్లు తెలిసినా పేదవారు ఆకలితో పస్తులు పడుకోకూడదని చెబుతూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తోంది కమలతల్. అవసరంలో ఆదుకున్నప్పుడే మనసుకు ప్రశాంతత, తృప్తి అనేది కలుగుతుందని ఈ బామ్మ కథను చదివిన వారు చెబుతున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications