మోడీని ఏకిపారేసిన రాహుల్, ఫోటోల కోసమని సెటైర్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని స్వచ్ఛ భారత్ పేరుతో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారన్నారు.
ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంపై కేవలం ఫొటోలు దిగే అవకాశం కోసమేనని ఎద్దేవా రాహుల్ గాంధీ ఈ సందర్భంగా చేశారు.
దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందన్నారు. ఎప్పుడైతే పునాదులు బలహీనపడతాయో, దేశ శత్రువులు లాభపడతారన్నారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ బీజేపీ పైన మండిపడ్డారు.

కాంగ్రెస్
పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే చంద్రయాన్, మంగళ్‌యాన్‌లాంటి ప్రయోగాలు సాధ్యపడేవి కాదని సోనియా అన్నారు. అంతరిక్ష ప్రయోగాల కోసం నెహ్రు ఎంతో కృషి చేసారని, వాటి ఫలితమే ఇప్పటి విజయాలన్నారు.

కాంగ్రెస్
ఇప్పటివరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నామని, అంతేకాకుండా మన నేతల నుంచి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నామన్నారు.

కాంగ్రెస్
సిద్ధాంతాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నామన్నారు. జాతి పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర గర్వకారణమన్నారు. భారత దేశ ఐక్యతకు నెహ్రూ విజన్ ఉపయోగపడిందన్నారు.

కాంగ్రెస్
దేశ పురోగతిని, స్వేచ్ఛను హరించాలని చూస్తున్న దుష్ట శక్తులతో పోరాటం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు.












Click it and Unblock the Notifications