'పాకిస్థాన్ కీ జై, చైనా కీ జై అంటారా?': వెళ్లిపోవచ్చని ఫడ్నవీస్

ముంబై : 'భారత్ మాతా కీ జై' నినాదం అంశంపై తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక్కడ బతకాలని అనుకుంటే 'భారత్ మాతా కీ జై' అని అనాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ నినాదం చేయనివాళ్లకు దేశంలో నివసించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 'భారత్ మాతా కీ జై అనకపోతే మరేమంటారు? పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ విషయంపై దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ముంబైలోని మజార్ ప్రాంతానికి వెళ్లి చూడండి. ఎంతమంది ముస్లిం మత పెద్దలు భారత్ మాతా కీ జై నినాదాన్ని పఠిస్తుంటారో తెలుస్తుంది' అంటూ చెప్పుకొచ్చారు.

Those Who Can't Praise 'Bharat Mata' Should Leave Country: Devendra Fadnavis

కాగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించాలన్నారు. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని తెలిపారు. మరోవైపు, మరికొందరు ముస్లింలు భారత్ మాతాకీ జై అనడంలో తప్పేమీ లేదని పేర్కొంటున్నారు.

కాగా, ముస్లింలు 'భారత్ మాతా కీ జై' అంటూ నినదించడంపై ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్‌బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+