టీకా తీసుకుంటే చనిపోతారట- గ్రామీణ భారతంలో పుకార్లు-వ్యాక్సినేషన్‌పై ప్రభావం

కరోనా సెకండ్‌వేవ్‌లో పట్టణాలు, నగరాలతో పోలిస్తే అత్యధిక ప్రభావం పడుతోంది గ్రామాలపైనే. తొలివేవ్‌లో పట్టణాలపై ప్రభావం చూపిన కరోనా వైరస్...ఇప్పుడు గ్రామాల్ని పట్టిపీడిస్తోంది. అయితే వైరస్ ప్రభావం పెరుగుతున్న కొద్దీ గ్రామాల్లో భయాలు కూడా పెరుగుతున్నాయి. ఈ భయాలు వైరస్ కంటే వ్యాక్సిన్‌ మీద కావడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. ముఖ్యంగా టీకా తీసుకుంటే చనిపోతారన్న పుకార్లు గ్రామీణ భారతాన్ని పట్టి పీడిస్తున్నాయి. దీంతో ఇక్కడ కేసులు ఎక్కువగా ఉన్నా వ్యాక్సినేషన్‌ ముందుకు సాగడం లేదు.

 గ్రామీణ భారతంలో కరోనా కల్లోలం

గ్రామీణ భారతంలో కరోనా కల్లోలం

గతేడాది వచ్చిన కరోనా వైరస్ ఫస్ట్‌వేవ్‌ సందర్భంగా పట్టణాలు, నగరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వలస కార్మికులు గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. వీరి రాకతో గ్రామాల్లో కూడా కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. ఇది చినికి చినికి గాలివానగా మారి గ్రామాల్లో కేసుల సంఖ్య పెరగడం మొదలుపెట్టింది.

ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ వచ్చేసరికి పట్ఠణాలతో పోలిస్తే గ్రామాల్లోనే కరోనా కేసుల సంఖ్య భారీగా ఉంది. ఫస్ట్‌వేవ్ సమయంలో పూర్తిగా నియంత్రణ పాటించిన గ్రామాలు ఇప్పుడు సెకండ్‌వేవ్‌లో మాత్రం కట్టు తెంచేసుకున్నాయి. దీంతో గ్రామీణ భారతంలో కేసులు తగ్గితేనే తప్ప సెకండ్‌ వేవ్ ముగిసినట్లు కాదని భావించే పరిస్ధితి వచ్చింది.

గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు

గ్రామాల్లో వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు

గ్రామాల్లో ఓవైపు కరోనా విజృంభిస్తున్నా, మరణాల సంఖ్య పెరిగిపోతున్నా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ ముందుకెళ్లలేని పరిస్ధితి ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రజల్లో ఉన్న భయాలే. దీంతో కరోనా వ్యాక్సిన్లు వేయించుకునేందుకు గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముందుకు రావడం లేదు.

గ్రామాల్లో ఉండే వారికి స్ధానికంగా ఉండే పరిస్ధితుల్ని బట్టి అలా భయపడుతున్నట్లు తెలుస్తోంది. స్ధానికంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో ఒకరిద్దరు చనిపోవడం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడటం వంటి వాటితో ఈ అపోహలు పెరుగుతున్నాయి. అసలే వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్న పరిస్ధితుల్లో ప్రభుత్వాలు కూడా దీనిపై అంత సీరియస్‌గా దృష్టిపెట్టలేని పరిస్ధితి ఉందని తెలుస్తోంది.

వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారన్న పుకార్లు

వ్యాక్సిన్ తీసుకుంటే చనిపోతారన్న పుకార్లు

వ్యాక్సిన్ వేయించుకుంటే చనిపోతారన్న పుకార్లు గ్రామీణ భారతంలో విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా వ్యాక్సీనేషన్‌ మొదలైన తొలి రోజుల్లో జరిగిన ఒకటీ అరా మరణాలే ఇందుకు కారణం. వీటిని దృష్టిలో ఉంచుకుని గ్రామాల ప్రజలు వ్యాక్సినేషన్‌ను ఆదరించడం లేదు. వ్యాక్సిన్లు వేసేందుకు వైద్య సిబ్బంది గ్రామాల్లోకి వెళ్తున్నా వారు తిరస్కరిస్తున్నారు. కరోనా సోకినా అల్లోపతి, ఆయుర్వేద మందుల్ని ఆశ్రయిస్తున్నారే తప్ప వ్యాక్సిన్లు మాత్రం వద్దంటే వద్దంటున్నారు.

గ్రామీణ విద్యావంతుల్లోనూ భయాలు

గ్రామీణ విద్యావంతుల్లోనూ భయాలు

అక్షరాస్యత స్ధాయిలు తక్కువగా ఉండే గ్రామాల్లో చదువుకున్న వారు సైతం వ్యాక్సిన్లపై, కరోనా కొత్త వేరియంట్లపై భయంభయంగానే గడుపుతున్నారు. ముఖ్యంగా గతంలో నగరాల్లో్ ఉండి వచ్చి ఇప్పుడు గ్రామాల్లో నివసిస్తున్న వారు సైతం వ్యాక్సిన్లు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పట్టణాల్లో వ్యాక్సినేషన్‌కు డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో కొందరు అక్కడి నుంచి పల్లెలకు వచ్చి వ్యాక్సిన్లు వేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు.

అయినా వీరిని చూసి కూడా వ్యాక్సిన్లు తీసుకునేందుకు స్ధానికంగా ఉండే వారు ముందుకు రాని పరిస్ధితి కనిపిస్తోంది. ఓవైపు డిసెంబర్‌ చివరి నాటికి దేశంలో వయోజనులందరికీ వ్యాక్సిన్‌ వేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం దీంతో నీరుగారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+