చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: జయ సమాధి నుంచి శభ్దాలు: పరుగో పరుగు

జయలలితతో పాటు ఆమెకు ఇష్టం అయిన వాచ్ ను సమాధి చేశారు. జయ సమాధి దగ్గరకు వెళ్లిన వారు అక్కడ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న వారికి సమాధిలో నుంచి శభ్దాలు వినిపించాయని అంటున్నారు. అంతే విషయం తెలుసుకున్న

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ ప్రజల ఆరాధ్య దైవం, అందరితో అమ్మ అని పిలుపించుకునే జయలలిత మరణించినా ఆమె ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. చెన్నైలోని మెరినా బీచ్ లో జయలలిత సమాధిని దర్శించడానికి ప్రతి రోజూ వేలాధి మంది అభిమానులు వస్తున్నారు.

 Thousands flock to burial spot of J. Jayalalithaa in Chennai’s Marina Beach

జయలలితను కడసారి చూసుకున్న అభిమానులు ఇప్పుడు జయ సమాధి దగ్గర ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జయలలితతో పాటు ఆమెకు ఇష్టం అయిన వాచ్ ను సమాధిలో పెట్టారు. సమాధి దగ్గరకు వెళ్లిన వారు అక్కడ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు.

అలా చేసిన వారికి సమాధిలో నుంచి శభ్దాలు వినిపించాయని అంటున్నారు. ఆ శభ్దాలు విన్న వారు చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న సమయంలో ఆ శభ్దాలు వినిపించాయట.

 Thousands flock to burial spot of J. Jayalalithaa in Chennai’s Marina Beach

అంతే ఇప్పుడు మెరినా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు పరుగు తీసి అక్కడ క్యూ కడుతున్నారు. జయలలిత కట్టుకున్న వాచ్ నుంచి టిక్ టిక్ అనే శభ్దాలు వినిపిస్తున్నాయని అమ్మ అభిమానులు అంటున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలనాటి సూపర్ స్టార్ ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) మరణించిన తరువాత ఆయనతో పాటు వాచ్ తో సహ సమాధి చేశారు. అప్పుడు ఇలానే సమాధిలోని వాచ్ నుంచి టిక్ టిక్ అనే శభ్దం వినిపించాయని వార్తలు వచ్చాయి. ఇప్పుడు జయలలిత సమాధి నుంచి వాచ్ చప్పుడు వస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు.

English summary
A day after she was laid to rest near the memorial site of her political mentor M G Ramachandran at Marina beach in Chennai, thousands of people from all over Tamil Nadu continued to make a beeline to the spot to pay homage to late Chief Minister Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X