జాయ్ రైడ్ అంటూ కారులో యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం,యువతి ఇలా..
ఢిల్లీలో నడుస్తున్న కారులో నగరంలో తిప్పుతూ ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జాయ్ రైడ్ అంటూ నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లిలో రోజుకో దారుణం వెలుగుచూస్తోంది. జాయ్ రైడ్ అంటూ, ఓ మురికివాడకు చెందిన ఓ మహిళను కారులో తీసుకెళ్ళి కారులోనే నగరంలో తిప్పుగూ ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
న్యూఢిల్లీలోని తుష్లుకాబాద్ ప్రాంతంలోని మురికివాడకు చెందిన 21 ఏళ్ల యువతిని ముగ్గురు యువకులు కారులో జాయ్ రైడ్ అంటూ తీసుకెళ్ళారు.
దక్షిణ ఢిల్లీలోని లజపత్ నగర్ నుండి మోతీబాగ్ మురికివాడ వరకు కారులో యువతిని తిప్పుతూ ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు.

యువతిపై అత్యాచారం చేసిన తర్వాత మోతీబాగ్ ప్రాంతంలో జనతా క్యాంపు వద్ద వదిలేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులైన ముబారక్ , ఆరిఫ్, విజయ్ లను అరెస్టు చేశారు పోలీసులు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నట్టుగా డిసిపి రోమిల్ బన్నియా చెప్పారు.












Click it and Unblock the Notifications