పశువులను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముగ్గురు బంగ్లాదేశీయులను కొట్టిచంపారు
గౌహతి: పశువులను ఎత్తుకెళ్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులను కొందరు గుంపుగా చేరి తీవ్రంగా కొట్టారు. దీంతో వారు మరణించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
పఠర్కండీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగ్రిజన్ టీ ఎస్టేట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌కు సరిహద్దుగా ఉండటం గమనార్హం. మృతి చెందిన ముగ్గురితోపాటు వచ్చిన మరో నలుగురు పారిపోయారని తెలిపారు.

ఆవులను దొంగిలించే ఉద్దేశంతోనే ఆ బంగ్లాదేశీయులు సరిహద్దులను దాటారు. పశువులను దొంగిలించే క్రమంలో స్థానికులు ముగ్గురిని పట్టుకుని కొట్టి చంపారు. మరో నలుగురు పరారయ్యారు. ముగ్గుర్ని చంపిన వారి కోసం గాలిస్తున్నామని కరీంగంజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజిత్ కృష్ణ తెలిపారు.
బంగ్లాదేశ్‌లో తయారైన బిస్కెట్లు, బ్రెడ్ తోపాటు తాళ్లు, ఫెన్స్ కట్టర్స్, బ్యాగ్, వైర్లను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతా దళాల ద్వారా బంగ్లాదేశీ మృతుల దేహాలను ఆ దేశ అధికారులకు అందించనున్నట్లు చెప్పారు.
కాగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కరీంగంజ్ ప్రాంతంలో పశువులను ఎత్తుకెళ్లే ప్రక్రియ ఇక్కడ సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికంగా కొందరు ఈ పశువుల దొంగలకు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..!












Click it and Unblock the Notifications