కర్ణాటక గేమ్ షురు...ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్
కర్ణాటక ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజకీయ పరిణామాలు ఊపందుకున్నాయి. ఓవైపు ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ శ్రేణులు సిద్దం అవుతుంటే మరోవైపు రాజీనామ చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టారు ఆ రాష్ట్ర స్పీకర్...ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యపై అనర్హత వేటు వేశాడు స్పికర్ కేఆర్ రమేశ్ కుమార్. ఒక ఇండిపెండెంట్‌తోపాటు మొత్తం ముగ్గురుపై అనర్హత వేటు పడింది.
కాగా వేటు పడిన ఎమ్మెల్యే రీ ఎలక్షన్ జరిగే వరకు పోటి చేయకూడదని ఆదేశాలు జారి చేశారు.
విశ్వాస తీర్మాణంలో సంకీర్ణ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కర్ణాటకలో రాజకీయ పరిణామాలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. సుప్రిం కోర్టు ఆదేశాల తర్వాత విశ్వాస తీర్మాణం ఓటింగ్‌ను నిర్వహించిన స్పికర్ రమేశ్ తదుపరి చర్యలకు పూనుకున్నాడు. మొత్తం రాజీనామ చేసిన మొత్తం 15మంది ఎమ్మెల్యేలు రాజీనామ చేయగా మొదటి దఫాలో ముగ్గురు పై అనర్హత వేటు వేశారు.

ఈనేపథ్యంలోనే కేపీజేపీ పార్టీ నుండి ఎన్నికై ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీలీనం చేసిన ఎమ్మెల్యే ఆర్ శంకర్ పై వేటు వేశాడు. కాగా శంకర్ తమ పార్టీని జూన్ 14న పార్టీని విలీనం చేసి, జూన్ 25న కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించాడు. శంకర్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా కూడ కొనసాగాడు. ఎమ్మెల్యపై కూడ ఓటింగ్‌కు రాకపోవడంతో ఆయనపై సిద్దరామయ్య స్పికర్‌కు పిర్యాధు చేశాడు. శంకర్‌తోపాటు మహేష్, రమేష్ అనే ఎమ్మెల్యేలపై వేటు పడింది.












Click it and Unblock the Notifications