రన్నింగ్ ట్రైన్ నుండి ముగ్గురు తోసివేత?
లక్నో: ఓ మతాధికారితో పాటు ముగ్గురు ముస్లింలను రన్నింగ్‌లో ఉన్న రైలు నుండి బయటకు గుర్తు తెలియని వ్యక్తులు తోసేసిన ఘటన ఒకటి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
న్యూఢిల్లీలో వారు రైలు ఎక్కారు. తమ స్వగ్రామమైన బాగ్‌పట్ వెళ్ళేందుకు ఈ రైలులో ప్రయాణం చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొందని బాగ్‌పట్ ఎస్పీ జై ప్రకాష్ సింగ్ తెలిపారు.

ఈ ఘటనపై బాగ్బత్ కోట్ పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు.గుల్జార్, ఇషార్, అబూ బక్ర్ అనే ముగ్గురు రైలు నుండి బయటకు తోసేశారా లేదా అనే విషయాన్ని విచారణలో తేలుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల నుండి విచారణ చేస్తున్నారు. విచారణలో పూర్తి వివరాలు బయటపడుతాయని ఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications