బెంగళూరులో పాకిస్థానీలు అరెస్టు: కరాచి యువతితో లవ్: కతర్ టూ నేపాల్ ! టార్గెట్ ?

పాకిస్థాన్ లోని కరాచికి చెందిన కిరణ్ గులామ్, సమీర, కాసిఫ్ శంషుద్దీన్ తో సహ కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ ను బెంగళూరులో అరెస్టు చేశారు. కరాచి యువతి కిరణ్, కేరళ యువకుడు మహమ్మద్ కతర్ లో ప్రేమించుకున్నారని,

బెంగళూరు: నలికి పాస్ట్ పోర్టులతో భారత్ లో ప్రవేశించి గుట్టుచప్పుడు కాకుండా బెంగళూరులో మకాం వేసిన ముగ్గురు పాకిస్థానీలను బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ కు చెందిన ఈ ముగ్గురు నకిలీ పాస్ పోర్టులతో గత 9 నెలల క్రితం నగరంలోని ప్రవేశించారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ మీడియాకు చెప్పారు.

కరాచీకి చెందిన కిరణ్ గులామ్, సమీరా, కాసిఫ్ శంషుద్దీన్, కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ అనే నలుగురిని అరెస్టు చేశామని గురువారం బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ చెప్పారు. నిందితులు కతర్ దేశం నుంచి నేపాల్ మీదుగా భారత్ లోకి అక్రమంగా వచ్చారని ప్రవీణ్ సూద్ వివరించారు.

బెంగళూరులోనే ఎందుకు ?

బెంగళూరులోనే ఎందుకు ?

పాకిస్థాన్ కు చెందిన ఈ ముగ్గురు భారత్ లో ప్రవేశించడానికి, బెంగళూరులో మకాం వెయ్యడానికి సహకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నామని ప్రవీణ్ సూద్ చెప్పారు. వీరు బెంగళూరు నగరంలోనే ఎందుకు మకాం వేశారు ? అని ఆరా తీస్తున్నామని ప్రవీణ్ సూద్ వివరించారు.

కతర్ లో ప్రేమించుకున్నారు

కతర్ లో ప్రేమించుకున్నారు

కరాచికి చెందిన యువతి కిరణ్ గులామ్, సమీరా, కాసిఫ్ శంషుద్దీన్ కతర్ లో ఉద్యోగం చేస్తున్నారు. కతర్ లోనే కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ ఉద్యోగం చేస్తున్నాడు. కరాచి యువతి కిరణ్ గులామ్, కేరళ యువకుడు మహమ్మద్ బషీర్ ప్రేమించుకున్నారు.

వ్యతిరేకించిన పాక్ ఫ్యామిలీ

వ్యతిరేకించిన పాక్ ఫ్యామిలీ

భారత్ కు చెందిన మహమ్మద్ బషీర్ కు వివాహం చేసుకోవడానికి కరాచి యువతి కిరణ్ గులామ్ కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయితే తల్లిదండ్రులను ఎదిరించిన కిరణ్ గులామ్ కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ ను వివాహం చేసుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

నకిలి పాస్ పోర్టుతో బెంగళూరు

నకిలి పాస్ పోర్టుతో బెంగళూరు

నకిలి పాస్ పోర్టులు తయారు చేసుకున్న కిరణ్ గులామ్, సమీరా, కాసిఫ్ శంషుద్దీన్ కతర్ నుంచి మస్కట్ మీదుగా నుంచి నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా భారత్ లో ప్రవేశించి బెంగళూరులోని కుమారస్వామి లేఔట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నలుగురు నివాసం ఉంటున్నారు.

కొన్ని నెలల నుంచి నిఘా !

కొన్ని నెలల నుంచి నిఘా !

పాకిస్థాన్ కు చెందిన ఈ ముగ్గురు, కేరళకు చెందిన మహమ్మద్ బషీర్ కుమారస్వామి లేఔట్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ నలుగురి కదలికల మీద కుమారస్వామి లేఔట్ పోలీసులకు అనుమానం వచ్చింది. కొన్ని నెలలుగా వీరి మీద నిఘా వేసిన పోలీసులు గురువారం ఉదయం (మే 25) అపార్ట్ మెంట్ మీద దాడి చేసి అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రవీణ్ సూద్ చెప్పారు.

నకిలి పత్రాలు, ఆధార్ కార్డులు సీజ్ !

నకిలి పత్రాలు, ఆధార్ కార్డులు సీజ్ !

పాకిస్థాన్ కు చెందిన కిరణ్ గులామ్, సమీర, కాసిఫ్ శంషుద్దీన్ నకిలి పాస్ పోర్టులతో పాటు నకిలి పత్రాలు ఉపయోగించి ఆధార్ కార్డుల తీసుకున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వాటిని బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు

ఐటీ హబ్ లో ఏం పని ? కేరళలో !

ఐటీ హబ్ లో ఏం పని ? కేరళలో !

పాకిస్థాన్ చెందిన యువతిని వివాహం చేసుకున్న మహమ్మద్ బషీర్ బెంగళూరులోనే ఎందుకు నివాసం ఉంటున్నాడు ? ముగ్గురు పాకిస్థానీ జాతీయులు బెంగళూరులోనే ఎందుకు మకాం వేశారు ? అంటూ ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులు వచ్చే సమయంలో తప్పించుకుపి పరారైన మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరులో సోదాలు ముమ్మరం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+