మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!

బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేతిలో ఆదివారం రాత్రి హత్యకు గురైనాడని బెళగావి పోలీసులు తెలిపారు.

బెళగావి నగరంలోని రాజపురోహిత్ లాడ్జ్ లో గత రెండు నెలల నుంచి నలుగురు స్నేహితులు ఉద్యోగం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆదివారం నలుగురు యువకులు ఉద్యోగానికి వెళ్లారు. ఆదివారం రాత్రి పోద్దుపోయిన తరువాత నలుగురు యువకులు పని పూర్తి చేసుకున్నారు.

రాత్రి లాడ్జ్ లోకి మద్యం తెచ్చుకున్న తరువాత నలుగురు యువకులు పీకలదాక సేవించారు. ఆ సమయంలో ముగ్గురు యువకులు వినాయక అనే యువకుడితో తాగిన మైకంలో గొడవ పెట్టుకున్నారు. యువకుల మద్య మాటామాట పెరిగింది.

Three persons in Belagavi murdered their friend in toilet in Karnataka

సహనం కొల్పోయిన ముగ్గురు యువకులు వినాయక అనే యువకుడిని హత్య చేశారు. వినాయక శవం తీసుకెళ్లి బాత్ రూంలో దాచి చెప్పారు. సోమవారం ఎప్పటిలాగే ముగ్గురు యువకులు లాడ్జ్ పనిలో బీజీ అయ్యారు. లాడ్జ్ యజమాని వినాయక గురించి ముగ్గురు యువకులను అడిగారు. వినాయక ఈ రోజు పనికి రాలేదని ముగ్గురు యువకులు లాడ్జ్ యజమానికి చెప్పారు.

లాడ్జ్ యజమానికి అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. ముగ్గురు యువకులు వినాయక అనే యువకుడితో గొడవపడిన విషయం గుర్తించిన లాడ్జ్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లాడ్జ్ బాత్ రూంలో వినాయక మృతదేహాం స్వాధీనం చేసుకుని ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. తాగిన మైకంలో వినాయకను హత్య చేశామని ముగ్గురు యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+