శశికళకు మరో షాక్: జయ టీవీ ఎండీ ఇంటిలో మూడు రివాల్వర్లు సీజ్, అక్రమ ఆయుధాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ కుటుంబ సభ్యుల దగ్గర అక్రమాస్తులు మాత్రమే కాదని, అక్రమ ఆయుధాలు ఉన్నాయని వెలుగు చూసింది. గుట్టుచప్పుడు కాకుండా శశికళ కుటుంబ సభ్యులు రివాల్వర్లు ఉపయోగిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

శశికళ అక్రమ ఆర్థిక సామ్రాజ్యం 1, 430 కోట్లు, ఐటీ అదుపులో మేనల్లుడు వివేక్, ఏం మాయ !

జయ టీవీ ఎండీ, జాజ్ సినిమాస్ సీఇవో, శశికళ మేనల్లుడు వివేక్ ఇంటిలో ఐదు రోజుల పాటు సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు, నగదు, నగలు గుర్తించి వాటిని సీజ్ చేశారు. సోమవారం రాత్రి వరకూ వివేక్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేశారు.

Three pistols seized from the Jaya TV MD Vivek's house

మంగళవారం మళ్లీ వివేక్ ను విచారణ చేస్తున్నారు. శశికళ మేనల్లుడు వివేక్ ఇంటిలో అక్రమాస్తులతో పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు మూడు రివాల్వర్లు (పిస్తోల్) సీజ్ చేశారని తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. వివేక్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న రివాల్వర్లకు లైసెన్స్ లు ఉన్నాయా, లేదా అనే విషయం కచ్చితంగా తెలియడం లేదు.

బెంగళూరు సెంట్రల్ జైల్లో టీవీకి అతుక్కుపోయిన శశికళ, కంటి మీద కునుకులేండా చేశారు !

అక్రమంగా ఇంటిలో ఆయుధాలు పెట్టుకున్నారని విచారణలో వెలుగు చూస్తే వివేక్ కచ్చితంగా జైలుకు వెళ్లే అవకాశం ఉందని తమిళ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. లైసెన్స్ లేకుండా రివాల్వర్లు ఇంటిలో పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం. వివేక్ ఇంటిలో మూడు రివాల్వర్లు ఎందుకు ఉన్నాయని, సామాన్యులను బలవంతంగా ఆస్తులు విక్రయించాలని బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారా అంటూ అధికారులు విచారణ మొదలు పెట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three pistols seized from the Jaya TV MD and Ilavarasi Son Vivek's house during the IT Raid.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి