దొంగలను కొట్టి చంపేసిన గ్రామస్తులు
బీహార్: చోరీ చెయ్యడానికి వచ్చారనే అనుమానంతో రెచ్చిపోయిన గ్రామస్తులు ముగ్గురిని పట్టుకుని చితకబాది దారుణంగా హత్య చేసిన సంఘటన బీహార్ లో జరిగింది. గ్రామస్తుల చేతిలో చావు దెబ్బలు తిన్న మరో వ్యక్తి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
బీహార్ లోని గయ జిల్లా గల విష్ణుగంజ్ గ్రామంలో ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత నలుగురు వ్యక్తులు ఒక ఇంటిలో చొరబడ్డారు. అదే సమంలో ముగ్గురు గ్రామస్తులు విషయం గుర్తించి దొంగలు ఉన్న ఇంటి బయట తలుపుకు తాళం వేశారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆ ఇంటి దగ్గర గుమికూడారు. తరువాత తాళం తీసి నలుగురిని బయటకు లాక్కొని వచ్చారు. ఆవేశంతో ఊగిపోయిన గ్రామస్తులు వెదురు కర్రలు, ఇనుప రాడ్ లు తీసుకుని నలుగురిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఈ దాడిలో ముగ్గురు అక్కడే మరణించారు.
తీవ్రగాయాలైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని గయ జిల్లా ఎస్పీ మను మహరాజ్ తెలిపారు. ముగ్గురి ని దొంగలు అనే అనుమానంతో చంపేశారని ఆయన స్పష్టం చేశారు. ఆరుగురి మీద కేసు నమోదు చేశామని, వారు పరారైనారని జిల్లా ఎస్పీ మను మహాజన్ తెలిపారు.












Click it and Unblock the Notifications