వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జవాన్ల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని కుప్వార్వా జిల్లాలో ఆదివారం ఉదయం భారత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందగా, ఒక ఆర్మీ జవాను తీవ్రంగా గాయపడ్డారు.

కుపార్వా జిల్లాలోని కుమ్హేర్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు ఆర్మీ బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

హురియత్ నేతల గృహ నిర్బంధంపై ఆందోళన

Three terrorists killed, one armyman injured in encounter in Handwara

హురియత్ నేతల గృహ నిర్బంధంపై జమ్మూకాశ్మీర్‌లో ఆందోళన కొనసాగుతోంది. గిలానీ నిర్బంధాన్ని నిరసిస్తూ ఆయన ఇంటి వద్ద మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో నలుగురు గాయపడ్డారు.

షబీర్ షాకు సమన్లు

ఢిల్లీ: వేర్పాటువాద నేత షబీర్ షాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో షబీర్ షాకు నోటీసులు జారీ అయినట్లు ఈడీ వెల్లడించింది.

2005లో ఢిల్లీ పోలీసులు మహ్మద్ వనీ అనే వ్యక్తి అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు షాపై కేసు నమోదైంది. రూ.2.25 కోట్లు మనీలాండరింగ్‌తో సంబంధం ఉన్నట్లు షాపై ఆరోపణలు ఉన్నాయి.

English summary
Three terrorists have been killed in an encounter on Sunday in north Kashmir's Handwara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X