బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bajarang Dal: హర్షా హత్య, ఆ రోజు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరంటే ?, పిన్ టూ పిన్ చెప్పిన పోలీస్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/సేలం: హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్యకు గురికావడంతో కర్ణాటకను కుదిపేసింది. హర్షా హత్య కేసులో ఇప్పటికే శివమొగ్గ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. శివమొగ్గతో పాటు బెంగళూరుకు చెందిన కొందరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హర్షా హత్యకు గురైన కొన్ని నిమిషాల ముందు ఓ యువతి అతనికి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురైనాడు. హర్షాకు ఫోన్ రావడం వలనే అతను ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఫోన్ చేసి పిలిపించి చంపేశారని అతని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఆరోపించారు. హర్షాకు ఫోన్ చేసింది కాలేజ్ అమ్మాయి అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. కేసు విచారణ చేస్తున్న పోలీసులు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆ కాలేజ్ అమ్మాయి ఎవరు ?, ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది ? భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య ఎందుకు జరిగింది ? అని కేసు విచారణ చేస్తున్న కర్ణాటక పోలీసులు పక్కా క్లారిటీ ఇచ్చారు.

Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !Aunty: ఇద్దరు ప్రియులు ఒకేసారి ఎంట్రీ, రచ్చరచ్చ, పాలడైరీ వ్యాపారితో ?, వీడియో తీసి యువకుడు !

భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య

భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య

హిజాబ్ వివాదం జరుగుతున్న సమయంలో శివమొగ్గ పట్టణంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురికావడంతో కర్ణాటకను కుదిపేసింది. హర్షా హత్య కేసులో ఇప్పటికే శివమొగ్గ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారు. శివమొగ్గతో పాటు బెంగళూరుకు చెందిన కొందరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

 అమ్మాయితో వీడియో కాల్ లో మాట్లాడిన హర్షా

అమ్మాయితో వీడియో కాల్ లో మాట్లాడిన హర్షా

హర్షా హత్యకు గురైన కొన్ని నిమిషాల ముందు ఓ యువతి అతనికి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లిన భజరంగ్ దళ్ కార్యకర్త హత్యకు గురైనాడు. హర్షాకు ఫోన్ రావడం వలనే అతను ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఫోన్ చేసి పిలిపించి చంపేశారని అతని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఆరోపించారు.

 ఒకే ఏరియాలో ఉంటున్న కాలేజ్ అమ్మాయి

ఒకే ఏరియాలో ఉంటున్న కాలేజ్ అమ్మాయి

కేసు విచారణ చేస్తున్న పోలీసులు భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆ కాలేజ్ అమ్మాయి ఎవరు ?, ఆ రోజు ఆ అమ్మాయి ఎందుకు ఫోన్ చేసింది ? భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా హత్య ఎందుకు జరిగింది ? అని కేసు విచారణ చేస్తున్న కర్ణాటక పోలీసులు పక్కా క్లారిటీ ఇచ్చారు.

 ఏవరు ఈ అమ్మాయి ?

ఏవరు ఈ అమ్మాయి ?

శివమొగ్గలో హర్షా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే ఓ యువతి నివాసం ఉంటున్నది. పారామెడికల్ కాలేజ్ లో చదువుతున్న ఆ అమ్మాయి హర్షాకు స్నేహితురాలు, భజరంగ్ దళ్ కార్యలకలాపాలతో పాటు హర్షా చేస్తున్న ప్రతిపని గురించి ఆ కాలేజ్ అమ్మాయికి చెబుతున్నాడని తెలిసింది. ఒకే ఏరియాలో నివాసం ఉంటున్న హర్షా, ఆ కాలేజ్ అమ్మాయి స్నేహితులను హర్షా హత్య కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు మీడియాకు చెప్పారు.

 ఫోన్ లో మాట్లాడుతుంటే చంపేశారు

ఫోన్ లో మాట్లాడుతుంటే చంపేశారు

ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి కాలేజ్ అమ్మాయి హర్షాకు ఫోన్ చేసింది. హర్షా హత్యకు గురైన కొన్ని నిమిషాల ముందు ఆ యువతి అతనికి వీడియో కాల్ చేసింది. వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన హర్షాను శివమొగ్గలోని క్లార్క్ పేట్ లో నివాసం ఉంటున్న మోహమ్మద్ ఖాసీమ్ అతని స్నేహితులు అతని మీద దాడి చేసి దారుణంగా చంపేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

 మూడు సంవత్సరాల నుంచి కక్ష

మూడు సంవత్సరాల నుంచి కక్ష

మూడు సంవత్సరాల క్రితం మోహమ్మద్ ఖాసీమ్ సిగేపేట్ లో హర్షా నివాసం ఉంటున్న ఇంటి సమీపంలో వెలుతున్న సమయంలో బైక్ లో నుంచి కిందపడిపోయాడు. ఆ సమయంలో మోహమ్మద్ ఖాసీమ్ గంజాయి సేవించాడని పోలీసులు అన్నారు. ఆ సందర్బంలోనే హర్షాకు, మోహమ్మద్ ఖాసీమ్ కు గొడవ జరిగిందని పోలీసులు అన్నారు.

 సంవత్సరం క్రితం స్కెచ్

సంవత్సరం క్రితం స్కెచ్

మూడు సంవత్సరాల క్రితమే హర్షాకు, మోహమ్మద్ ఖాసీమ్ మద్య గొడవలు మొదలైనాయని పోలీసు అధికారులు అన్నారు. ఇస్లాం మతం గురించి అవహేళన చచేస్తూ హర్షా సోషల్ మీడియాలో పోస్టు చేశాడని, సంవత్సరం క్రితమే అతన్ని చంపేయాలని మోహమ్మద్ ఖాసీమ్ స్కెచ్ వేశాడని,

Recommended Video

Top 10 Personalities on Google Trends 2021 | Oneindia Telugu
 కాలేజ్ అమ్మాయికి సంబంధం లేదు.... పాతకక్షలు కారణం

కాలేజ్ అమ్మాయికి సంబంధం లేదు.... పాతకక్షలు కారణం

సంవత్సరం క్రితం హర్షాను హత్య చెయ్యాలని స్కెచ్ వేసినా అప్పట్లో అదిసాధ్యం కాలేదని, ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి పక్కాప్లాన్ తో చంపేశారని పోలీసు అధికారులు అంటున్నారు. హర్షా హత్య కేసుకు కాలేజ్ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని, హర్షా హత్యకు గురైనాడు అని తెలిసిన వెంటనే ఆ అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి తాను ఇంతకు ముందే అతనితో మాట్లాడానని చెప్పిందని పోలీసు అధికారులు అన్నారు. పాతకక్షాల కారణంగానే హర్షా హత్యకు గురైనాడని కర్ణాటక పోలీసు అధికారులు అంటున్నారు. హిజాబ్ వివాదం మొదలైన తరువాత హర్షా హత్యకు గురైనాడు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సొంత జిల్లా, ప్రస్తుత కర్ణాటక హోమ్ మంత్రి సొంత జిల్లా అయిన శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షా దారుణ హత్యకు గురికావడం కర్ణాటకలో కలకలం రేపింది. హర్షా హత్యతో శివమొగ్గ రణరంగం అయ్యింది. ప్రస్తుతం శివమొగ్గలో 144 సెక్షన్ అమలులోనే ఉంది.

English summary
Bajrang Dal: An old enmity between the three accused and slain Bajrang Dal worker Harsha was the main reason behind the killing of the latter, police investigation revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X