వితంతు మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్
ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడట్లేదు. రోజుకో అత్యాచార వార్తతో నిత్యం యూపీ వార్తల్లో నానుతూనే ఉంది. తాజాగా ముగ్గురు యువకులు కలిసి ఓ వితంతువును అత్యాచారం చేసిన ఘటన దౌలత్ పూర్ లో చోటు చేసుకుంది.
షామీ జిల్లా ఘారి దౌలత్ పూర్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల వితంతువు తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఇంట్లోకి చొరబడి బెదిరింపులతో ఆమెపై లైంగిక దాడి జరిపారు. అనంతరం విషయం బయటకు పొక్కితే చంపేస్తామని ఆమెను బెదిరించారు.

అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులు సల్మాన్, సదా హుస్సేన్, సలీం లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications