మహిళ స్నానం చేస్తుండగా ఫోటో తీసేందుకు కెమెరా

రిషికేష్: ఓ మహిళ స్నానం చేస్తుండగా, ఆమెను ఫొటోలు తీసేందుకు ప్రయత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రిషికేష్‌లో జరిగింది. ఓ మహిళ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రిషికేష్‌ వచ్చింది.

అక్కడ అతిథి గృహంలో ఆమె స్నానానికి వెళ్లింది. అయితే, బాత్‌రూంకి రహస్యంగా ఓ కెమెరాని అమర్చి ఉంచడాన్ని ఆమె గుర్తించింది. కుటుంబ సభ్యులకి సమాచారం అందించింది. వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అతిథి గృహంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ముగ్గురు యువకులు బాత్‌రూం వద్ద కెమేరాను అమర్చడం కనిపించింది. దీంతో పోలీసులు ఆ ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Three youth held for taking obscene photos of women with spy cam

గల్లంతైన వారికోసం ముమ్మరంగా గాలింపు

అస్సాంలోని కామ్‌రూప్ రూరల్ జిల్లాలో మరపడవ ప్రమాదంలో ముప్పై మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ సోమవారం పొద్దుపోయాక కొలోహీ నదిలో మునిగిపోయింది.

ప్రయాణికుల్లో అత్యధికులు ఈదుకుని ఒడ్డుకు చేరుకోగా 30 మంది ఆచూకీ తెలియరాలేదు. చీకటిపడడంతో గాలింపు చర్యలు నిలిపివేసి మంగళవారం ఉదయం మళ్లీ చేపట్టారు. అయితే ఆ 30 మంది కూడా ఈదుకుని ఏదో ఒడ్డుకు సురక్షితంగానే చేరుకుని ఉంటారని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+