పెద్దనోట్ల రద్దుకు జనం జేజేలు?: ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి దేశ ప్రజలు మద్దతు పలుకుతున్నట్లు ముంబై, గుజరాత్‌లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి, ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది.

ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ సాధించింది. వల్సద్ జిల్లాలోని 44 మున్సిపాలిటీలకు గాను 41 మున్సిపాలిటీలను బీజేపీ కైవసం చేసుకుంది. కనక్‌పూర్-కన్సద్ (సూరత్) మున్సిపాలిటీల్లోని 28 సీట్లకు 27 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది.

narendra modi

గోండల్ తాలూక పంచాయతీలో 22 సీట్లలో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. జిల్లా పంచాయతీలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుకుది. ఏడు పంచాయతీలకు గానూ 5 పంచాయతీలు బీజేపీ గెలుచుకుంది. 15 తాలూకా పంచాయతీల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ 5, కాంగ్రెస్ 4 గెలుచుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల తక్కిన సీట్ల ఫలితాలు వెల్లడించలేదు.

ఎన్నికల్లో బిజెపి గెలుపుపై మోడీ హర్షం: ప్రజలకు కృతజ్ఞతలు

results

మహారాష్ట్ర, గుజరాత్ ఎన్నికల్లో బిజెపిని గెలిపించిన ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం అవినీతిపై చేస్తున్న పోరుకు ప్రజలు మద్దతిస్తున్నారని ఈ ఫలితాలతో తేలిపోయిందని మోడీ అన్నారు. తమ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకాన్ని ఉంచారని అన్నారు.

గుజరాత్‌లో బిజెపి విజయం సాధించేందుకు సీఎం విజయ్‌రూపాని, ఆ రాష్ట్ర బిజెపి నేత, ఎమ్మెల్యే జితూ వాఘాని ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి.

పశ్చిమ్‌బంగా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాల్లో బిజెపిప్రదర్శన బాగుందంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో భాజపా గెలుపు.. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాలకు మేలుకొలుపు కావాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP has followed up its success in the Maharashtra civic elections with a sweep of by-elections to local bodies in Gujarat, asserting that the wins signal the people's support for Prime Minister Narendra Modi's ban on 500 and 1,000 rupee notes to combat black money.
Please Wait while comments are loading...