టిట్‌టాక్ టోనీ ఆత్మహత్య: తల్లిదండ్రులకు ‘సారీ’ అంటూ సందేశం
విశాఖపట్నం: భీమిలి బీచ్ రోడ్డు మంగమూరిపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్‌టాక్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. టిక్‌టాక్ టోనీగా పేరుతెచ్చుకున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగమూరిపేటకు చెందిన గరికిన తాతారావు అలియాస్ టోనీ(25) టిక్‌టాక్ వీడియోలు చేస్తుండటంతో అందరూ టిక్ టాక్‌టోనీగా పిలవడం మొదలుపెట్టారు. ఇతడు ఓ బిర్యానీ పాయింట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా, టోనీకి పలాస ప్రాంతంలోని మరువాడ గ్రామానికి చెందిన ఓ యువతితో నాలుగు నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు వాట్సాప్ స్టేటస్‌లో తన వైవాహిక జీవితం గురించి ప్రస్తావించాడు. తాను తన వైవాహిక జీవితంలో విసిగిపోయినట్లు భార్యను ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. తన తల్లిదండ్రులను క్షమించాలని కోరాడు.
శనివారం ఉదయం ఫ్యానుకు వేలాడుతున్న టోనీ మృతదేహాన్ని చూసి అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలే తన కుమారుడి బలవన్మరణానికి కారణమని మృతుని తల్లి పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recommended Video
బస్సు బోల్తాపడి 8 మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం పెద్దినాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డివైడర్ ను ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను టెక్కలి, పలాస ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications