Times Now-ETG Exit poll: రాజస్దాన్ లో బీజేపీదే విజయం-సంప్రదాయం మార్చని ఓటర్లు..
రాజస్తాన్ లో ఈ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ-ఈటీజీతో కలిపి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా ఇవాళ ప్రకటించింది. ఇందులో విపక్ష బీజేపీకి అధికారం ఖాయమని తేలింది. అధికార కాంగ్రెస్ కు ఈసారి చేదు ఫలితాలు తప్పవని ఈ సర్వేలో తేలిపోయింది. రాజస్తాన్లో ఐదేళ్ల కోసారి అధికారం మార్చే ఓటర్ల సంప్రదాయం ఈసారి కూడా మారలేదు.
Recommended Video

టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో బీజేపీకి రాజస్తాన్ లో 108-128 స్ధానాలు దక్కుతాయని తేలింది. అలాగే రెండో స్ధానంలో ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 56-72 సీట్లు మాత్రమే దక్కుతాయని తేలింది. రాజస్తాన్ ఎన్నికలపై టైమ్స్ నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీకి మధ్య ఓట్ల శాతం, సీట్లలోనూ భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. దీంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాపడం కష్టమేనని తేలిపోయింది.

రాజస్తాన్ లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమించింది. ఈసారి ఏడు గ్యారంటీల పేరుతో సంక్షేమ అజెండాతోనే ఎన్నికలకు వెళ్లింది. అయినా అశోక్ గెహ్లాట్ వర్సెస్ నరేంద్రమోడీగా సాగిన ఈ పోరులో బీజేపీ ముందంజ వేసినట్లు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ గ్యారంటీలను కూడా ప్రజలు నమ్మలేదని తేలిపోయింది. అలాగే గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సాగిన అంతర్గత పోరు కూడా కాంగ్రెస్ ను ముంచినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications