వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Times Now's Kerala Opinion Poll 2021: ఎల్డీఎఫ్‌దే అధికారం, బీజేపీకి ఒక్కటే

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నవేళ ఓపీనియన్ పోల్ అంచనాలు వెలువడుతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో లెఫ్ట్ డమోక్రటిక్ ఫ్రంట్(ఎల్‌డీఎఫ్), యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) మధ్య అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. 2016 నుంచి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా ఇక్కడ తన ఉనికిని చాటుకోవడం మొదలుపెట్టింది.

గత డిసెంబర్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు విజయాలను నమోదు చేసి ఈ రెండు కూటములకు షాకిచ్చింది. 2016లో ఎన్డీఏకు 15 శాతం ఓటు షేర్ ఉండగా, 200 స్థానిక సంస్థల ఎన్నికల్లో 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకుంది.

Times Nows Kerala Opinion Poll 2021 projects win for LDF in upcoming Assembly Elections 2021

2016 మేలో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి మొత్తం 140 అసెంబ్లీ స్థానాల్లో 91 స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చింది. ఇక యూడీఎఫ్ 47 స్థానాలు దక్కించుకుంది. చివరి స్థానం స్వతంత్ర అభ్యర్థి పీసీ జార్జ్ గెలుపొందారు. ఒక స్థానంలో బీజేపీ గెలిపించింది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా టైమ్స్ నౌ-సీ ఓటర్ ఓపీనియన్ పోల్ మరోసారి ఎల్డీఎఫ్ కూటమికే అధికారం దక్కుతుందని చెప్పింది. 2016లో కంటే 14 స్థానాలు తక్కువ, అంటే 77 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. ప్రధాన ప్రత్యర్థి యూడీఎఫ్ కూటమి 62 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. ఇక బీజేపీ 2016లో గెలిచిన ఒక స్థానంతోనే సరిపెట్టుకుంటుందని అంచనావేసింది.

ఇక ఓటు షేర్ విషయానికొస్తే.. ఎల్డీఎఫ్ కూటమికి 42.4 శాతం(2016లో 43.5శాతం), యూడీఎఫ్‌కు 38.6శాతం దక్కించుకోగా, బీజేపీ 2016 కంటే 1.5 శాతం ఎక్కువ ఓటు షేరుతో 16.4శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇతర పార్టీలో ఒక సీటు కంటే ఎక్కువ వచ్చే అవకాశాలు లేవని, 2.6 శాతం ఓటు షేర్ ఉంటుందని పేర్కొంది.

ఎల్డీఎఫ్ విజయావకాశాలు: 71-83 సీట్లు
యూడీఎఫ్: 56-68 స్థానాలు

టైమ్స్ నౌ సీ-ఓటర్ సర్వేలో కొన్ని ప్రశ్నలను ప్రజలకు వేసింది. వాటికి జనం సమాధానాలు..

కేరళ ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది?

పినరయి విజయన్(సీపీఐ(ఎం): 39.3శాతం
ఊమెన్ చాందీ(ఐఎన్‌సీ): 26.5 శాతం
ముల్లపల్లి రామచంద్రన్(ఐఎన్‌సీ): 8.8 శాతం

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలావుంది?

చాలా బాగుంది: 23.88 శాతం
బాగుంది: 32.58 శాతం
సంతృప్తికరంగా లేదు: 42.54 శాతం
చెప్పలేం: 1 శాతం
సగటు: 13.92 శాతం

కేరళ ప్రభుత్వ పాలన ఎలా ఉంది?

చాలా బాగుంది: 41 శాతం
బాగుందిం 35.55 శాతం
సంతృప్తికరంగా లేదు: 20.82 శాతం
చెప్పలేం: 2 శాతం
సగటు: 56.37 శాతం

ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది?
చాలా బాగుంది: 44.72 శాతం
బాగుంది: 32.92 శాతం
సంతృప్తికరంగా లేదు: 21.93 శాతం
చెప్పలేం: 0.4 శాతం
నెట్: 55.71

రాహుల్ గాంధీ పనితీరు ఎలావుంది.

చాలా బాగుంది: 31.32 శాతం
బాగుంది: 29.94 శాతం
సంతృప్తికరంగా లేదు: 33.32 శాతం
చెప్పలేం: 5.42 శాతం
నెట్: 27.94 శాతం

English summary
For nearly four decades now, power over the state's legislature has alternated between the Left Democratic Front (LDF) and the United Democratic Front (UDF).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X