టైమ్స్ నౌ సర్వే : తమిళ జనం లెక్క ఇదే... ఏ పార్టీని గెలిపించబోతున్నారు.. సీఎంగా ఎవరికి జై కొడుతున్నారు..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకెదే విజయమని మరో సర్వే అంచనా వేసింది. ఇటీవలే ఏబీపీ సీఓటర్ సంయుక్త సర్వేలో ఈసారి అధికారం డీఎంకెదేనని తేలగా... తాజాగా టైమ్స్ నౌ సర్వేలోనూ అదే వెల్లడైంది. డీఎంకె,కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 46శాతం ఓట్లతో అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేసింది. 2016 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి యూపీఏ కూటమికి 6.6శాతం ఓట్లు పెరగనున్నట్లు తెలిపింది. ఇక అన్నాడీఎంకె,బీజేపీ,ఇతర పార్టీలతో కూడిన ఎన్డీయే ఓటు బ్యాంకు ఈసారి గణనీయంగా తగ్గనున్నట్లు సర్వే వెల్లడించింది.

ఎవరికెన్ని సీట్లు...
2016 అసెంబ్లీ ఎన్నికల్లో 43.7శాతం ఓట్లు దక్కించుకున్న ఎన్డీయే కూటమికి ఈసారి కేవలం 34.6శాతం ఓట్లు మాత్రమే పోల్ అవుతాయని సర్వేలో వెల్లడైంది. అంటే గతంతో పోలిస్తే 9.9శాతం ఓట్లను ఎన్డీయే కూటమి కోల్పోనున్నట్లు తెలిపింది. సర్వే ప్రకారం... మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో యూపీఏ కూటమి 173 నుంచి 181 సీట్ల వరకూ గెలుచుకోనుంది. ఎన్డీయే కేవలం 45 నుంచి 43 సీట్లకే పరిమితం కానుంది. ఇక కమల్ హాసన్ నేత్రుత్వంలోని మక్కల్ నీది మయ్యం కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోనుంది. టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం కూడా ఒక్క సీటుతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడైంది.

ముఖ్యమంత్రిగా స్టాలిన్‌కే జై కొట్టిన జనం...
ఇప్పటికిప్పుడు తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే 46శాతం మంది యూపీఏ కూటమికే ఓటు వేస్తామని వెల్లడించారు. ఎన్డీయే కూటమికి కేవలం 34శాతం మంది మాత్రమే ఓటేస్తామని తెలిపారు. మీరెవరికి ఓటేస్తారన్నది పక్కనపెడితే... ఎవరు గెలవబోతున్నారన్న ప్రశ్నకు 47.3శాతం మంది యూపీఏదే విజయమని స్పష్టం చేశారు. కేవలం 32.5శాతం మాత్రమే ఎన్డీయే గెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి స్థానానికి డీఎంకె అధినేత స్టాలినే సరైన నేత అని 43.1శాతం మంది అభిప్రాయపడ్డారు.పళనిస్వామి ఆ స్థానానికి సరైన నేత అని 29.7శాతం మంది,8.4శాతం మంది శశికళ ఆ స్థానానికి సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డారు.

'జైశ్రీరామ్ నినాదం' తమిళ గడ్డ స్వాగతిస్తుందా?
తమిళనాడులో జైశ్రీరామ్ నినాదాన్ని జనం ఆమోదిస్తారా అన్న ప్రశ్నకు 45.5శాతం మంది నో చెప్పారు. 31.7శాతం మంది ఆమోదిస్తారని,22.8శాతం మంది ఏమీ చెప్పలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత అన్నాడీఎంకె ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉందని 36.37శాతం మంది,చాలా బాగుందని 18.15శాతం మంది,ఏమాత్రం బాగా లేదని 38.8శాతం మంది,ఏమీ చెప్పలేమని 6.68శాతం మంది తెలిపారు. మొత్తం 1513 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేను రూపొందించారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications