కదిలిన తేనెతుట్టే.. కోల్‌కతా ఫ్లై ఓవర్ యూపీ సర్కార్ నిర్మించినట్టు యాడ్..

బీజేపీ లక్ష్యంగా టీఎంసీ విమర్శలు గుప్పిస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడింది. యూపీ సర్కార్ కోల్ కతా ప్లై ఓవర్‌ను తమ ప్రభుత్వం చేసిన అంశంగా పరిగణిస్తూ యాడ్ ఇచ్చిందని టీఎంసీ ఫైర్ అయయింది. టీఎంసీ నేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించారు. సోషల్ మీడియాలో ఏకీపారేశారు. బెంగాల్ మౌలిక వసతుల నిర్మాణాలను బీజేపీ ఎలా దొంగిలించిందో చూడండి అంటూ ఫైరయ్యారు.

మమతా బెనర్జీ నిర్మించిన వాటిని యోగి ప్రచార అస్త్రాలుగా వాడుకున్నారు. డబుల్ ఇంజిన్ మోడల్ అంటూ విరుచుకుపడ్డారు. ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని ఫైరయ్యారు. అతి పెద్ద రాష్ట్రంలో.. బలంగా ఉన్న బీజేపీ ఇలా చేయడం సరికాదు అని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు. మంత్రి ఫర్హాద్ హకీమ్ మాట్లాడుతూ.. ఆ బ్రిడ్జీ నిర్మాణం కోల్ కతా గౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. టీఎంసీ హయాంలో నిర్మిస్తే.. బీజేపీ ఫోటోలు వాడటం సిగ్గుచేటన్నారు. కానీ బెంగాల్‌లో శాంతి భద్రతలు సరిగా లేవని విమర్శలు మాత్రం చేస్తారని మండిపడ్డారు.

 TMC criticises U.P. govt. for using photo of Kolkata flyover in its advertisement

టీఎంసీ సీనియర్ నేతలు పార్థ ఛటర్జీ, ఎంపీ మొహుబా మొయిత్రా కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఆదివారం ఓ ఇంగ్లిష్ పేపర్‌లో యాడ్ వేశారు. ఇదీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్మించిందని చెప్పడం వివాదానికి తెరలేపింది. ఫ్లై ఓవర్ సాల్ట్ లేక్, రాజార్‌హట్‌ను కలుపుతుంది. ప్రై ఓవర్‌పై ఎల్లో టాక్సీ, పైవ్ స్టార్ హోటల్ కూడా కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత పేపర్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అదీ పొరపొటున పబ్లిష్ అయ్యిందని తెలియజేసింది.

Recommended Video

    'Father Knows Who The Father Is' - TMC MP Nusrat Jahan || Oneindia Telugu

    ఆ ఇమేజ్ అన్నీ డిజిటల్ మీడియాలో తీసివేశామని పేర్కొన్నది. యూపీ ప్రభుత్వం- న్యూస్ మార్కెటింగ్ విభాగం తప్పుడు ఫోటో ప్రచురితం అయ్యినట్టు అంగీకరించింది. ఈ మేరకు సదరు పత్రిక యాజమాన్యం ట్వీట్ కూడా చేసింది. దీనిపై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందించారు. ఆ ఇమేజ్ తప్పయితే.. టీఎంసీ కోర్టును ఆశ్రయించాలని కోరారు. ఎందుకు యాగీ చేస్తున్నారని విమర్శించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+